https://oktelugu.com/

RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…

RRR Movie: డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ మేరకు నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏కు అనుహ్యమైన స్పందన వస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ విజువల్స్… డైలాగ్స్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 01:56 PM IST
    Follow us on

    RRR Movie: డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ మేరకు నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏కు అనుహ్యమైన స్పందన వస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ విజువల్స్… డైలాగ్స్ అదిరిపోయాయి. తమ అభిమాన హీరోలను జక్కన ప్రేక్షకుల అంచనాలకు మించి చూపించారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్, గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు నెట్టింట్లో సంబరాలు చేసుకుంటున్నారు.

    mega star chiranjeevi and mahesh babu respond on rrr movie trailer

    Also Read: “పుష్ప”లోని “ఊ అంటావా… ఊహు అంటావా” సాంగ్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్…

    ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఓ బీభత్సం… ఇక పూర్తి ప్రభంజనం కోసం జనవరి 7 వరకూ ఎదురుచూస్తుంటాను అన్నారు చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అలానే ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి స్పందించారు. మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. వీడియోలోని ప్రతి షాట్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మరో అద్భుతమైన చిత్రంతో వచ్చేశారు అంటూ ట్వీట్ చేశారు మహేష్. ఈ ట్రైలర్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

    Also Read: లక్ష్య రివ్యూ