RRR OTT Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 వారు కొనుగోలు చేశారు. మరి జీ5 లో ఈ 1000 కోట్ల సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది ? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మే 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 మరియు నెట్ ఫ్లిక్స్ వారు కొన్నారు. జీ5, నెట్ ప్లిక్స్ వారు ఈ చిత్రాన్ని హిందీలో తప్ప మిగతా అన్నీ బాషలలోను విడుదల చేయబోతున్నారు. ఐతే, జీ5, నెట్ ప్లిక్స్ లో మే 20వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చూడాలంటే మరో కండిషన్ కూడా ఉంది.
Also Read: Acharya 5 Days Collection: 5 రోజుకే పాతిక లక్షలకు పడిపోయిన ఆచార్య !
పే పర్ వ్యూలాగా ఈ సినిమా చూడాలి అంటే కొంత మొత్తంలో డబ్బు కట్టాలి. ఐతే.. జూన్ 3వ తేదీ నుంచి ఈ సినిమా ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. ఏది ఏమైనా నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ భారీ విజయాన్ని అందుకుంది.

‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 501.74 కోట్లు కలెక్ట్ చేసింది.
అంటే.. పదో రోజు నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాలు కింద లెక్కే. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. అసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ప్రపంచ సినీ లోకమంతా షాక్ అయిపోయింది.
Also Read:Krishna Vrinda Vihari: ‘ఏముంది రా’.. బ్యూటీఫుల్ లైఫ్ ను ఊహించుకుంటున్న నాగశౌర్య !
[…] Also Read:RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర… […]
[…] Also Read: RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర… […]
[…] Also Read: RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర… […]