
RRR Olivia Morris: “ఆర్ఆర్ఆర్” (RRR Movie) సినిమాలో హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ (Olivia Morris) నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తన పార్ట్ కి సంబంధించిన షూట్ ను పూర్తి చేసుకుంది ఒలీవియా. ఎలాగూ తనకు ఇక షూటింగ్ లేకపోవడంతో ఈ హాలీవుడ్ భామ హైదరాబాద్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డితో కలిసి ఒలీవియా మోరీస్ శిల్పారామం దగ్గర కనిపించి షాక్ ఇచ్చింది.
శిల్పారామంలోని ప్రకృతి అందాలు తనకు ఎంతగానో నచ్చాయి అని కూడా ఒలీవియా చెబుతూ.. ముఖ్యంగా ఇక్కడ హస్తకళల విద్యకు నేను ముగ్ధురాలనైపోయాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక హైదరాబాదీ పానీపూరీ తిని.. రుచి చాలా బాగుంది అంటూ ఒలీవియా మోరీస్ తెలిపింది. హైదరాబాద్ వీధుల్లో ఒలీవియా మోరీస్ తిరిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ భారీ మల్టీస్టారర్ పై నేషనల్ లెవల్లో అభిమానుల్లో ఉన్న అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. రాజమౌళి కూడా పక్కాగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ కలిసి హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాకి సహజంగానే భారీ బిజినెస్ అవుతుంది.
View this post on Instagram
అందుకే, ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకోవడానికి భారీ మొత్తాన్నే ఇచ్చింది. అయితే, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, అక్టోబర్ 13కి మరెంతో సమయం లేదు. అంటే అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కావట్లేదు అనేది క్లారిటీ వచ్చింది.
మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి మాత్రం కొత్త డేట్ ఇంకా రివీల్ చేయకుండా సైలెంట్ అయిపోయాడు. ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, ఎలిసన్ డ్యూడీ, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.