చలిలో వేడిరాజేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’.. వీడియో వైరల్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను అందిస్తున్నాడు.‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ […]

Written By: NARESH, Updated On : November 17, 2020 12:52 pm
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను అందిస్తున్నాడు.‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్.. హాలీవుడ్ నటి ఓలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.కరోనా ఎఫెక్టుతో ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. మేకింగ్ సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ గతంలోనే విడుదల చేసిన సంగతి తెల్సిందే. అలాగే ‘ఆర్ఆర్ఆర్’లో ఓ పోరాట సన్నివేశానికి సంబంధించి చిన్న వీడియో కూడా ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేయగా అదికాస్తా వైరల్ అయింది.

Also Read: బ్రూస్ లీ గురించి సంచలన నిజాలు చెప్పిన పూరి జగన్నాథ్

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి మరో అప్డేట్ వచ్చింది. అర్థరాత్రి షూటింగ్ పరిస్థితులు ఎలా ఉంటాయో వెల్లడిస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియో సోషల్ మీడియా విడుదల చేసింది. ఈ వీడియోకు ‘సెట్ హీటర్స్ లేకుండా ఎవరూ ఈ చల్లని గాలుల నుంచి తప్పించుకోలేరు’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కామెంట్స్ జోడించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ వీడియోలో చిత్రబృందం చలిలో వణుకుతూ షూట్ లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. దర్శకుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కెమెరామెన్ సెంథిల్ కుమార్ తోపాటు పలువురు సెట్లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కన్పించారు. అర్ధరాత్రి చలిలో షూటింగ్ ఎలా ఉంటుందో తెలియజేస్తూనే ‘ఆర్ఆర్ఆర్’ స్పీడు పెరిగిందనే సందేశాన్ని జక్కన్న అభిమానులకు పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుండగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.