క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ జులై 15న ఉదయం 11 గంటలకు ఒక మేకింగ్ వీడియో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. మొత్తానికి ఈ రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ గురించి రోజురోజుకు ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
దీనికి తోడు ఈ అప్ డేట్ ను హైలైట్ చేస్తూ మేకర్స్ కూడా ప్రేక్షకులను అలెర్ట్ చేస్తూ.. ఈ మేకింగ్ వీడియో గర్జన కోసం సిద్ధం కమ్మని చరణ్, ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ కోరుతూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. రాజమౌళి మరియు కార్తికేయలు సెట్స్ లో కలిసి ఉన్న ఫోటోని ఈ పోస్టర్ లో హైలైట్ చేస్తూ వదిలారు.

ఇక ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ని అక్టోబర్ 13నే ఉంచడం విశేషం. ఇటీవల ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ పై కీలక సీన్స్ ను షూట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా కోసం నేషనల్ వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్ జరుగుతుంది.
ఇప్పటికే ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రికార్డ్ రేంజ్ లో భారీ మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఇచ్చింది పెన్ స్టూడియోస్ సంస్థ. ఏది ఏమైనా రాజమౌళి దర్శకుడు అవ్వడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకి మార్కెట్ కూడా అట్టహాసంగా జరుగుతుంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.