RRR Japan Collections: గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది. బాహుబలి 2 ని క్రాస్ చేసి రజినీకాంత్ ముత్తు రికార్డు పై కన్నేసింది. ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో మంచి విజయం సాధిస్తుందని రాజమౌళి గట్టిగా నమ్మారు. అందుకే ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో విడుదలైంది. విడుదలకు వారం రోజులు ముందే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ వెళ్లారు.

జపాన్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. స్థానిక అభిమానులతో ఫోటో సెషన్స్ లో పాల్గొని జనాల్లోకి సినిమాను తీసుకెళ్లారు. అది సినిమా సక్సెస్ కి ఎంతగానో ఉపయోగపడింది. బాహుబలి 2 లైఫ్ టైం రికార్డు ఆర్ ఆర్ ఆర్ కేవలం నాలుగైదు వారాల్లో లేపేసింది. ఆర్ ఆర్ ఆర్ ¥ 305 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. అమీర్ 3 ఇడియట్స్, ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసి సెకండ్ హైయెస్ట్ ఇండియన్ గ్రాస్ మూవీగా నిలిచింది.
ఇక ఆర్ ఆర్ ముందున్న టార్గెట్ రజినీకాంత్ ముత్తు మాత్రమే. ముత్తు చిత్రం ¥400 మిలియన్ వసూళ్లతో ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా ఉంది. ఆర్ ఆర్ ఆర్ జోరు చూస్తుంటే ముత్తు రికార్డును కూడా బ్రేక్ చేస్తుందనిపిస్తుంది. జపాన్ లాంగ్ రన్ బాక్సాఫీస్. అక్కడ చిత్రాలు రోజుల తరబడి ఆడతాయి. బాహుబలి 2 వంద రోజులు జపాన్ థియేటర్స్ లో ప్రదర్శితమైంది.ఇక యూఎస్ లో $14 మిలియన్ వసూళ్లకు పైగా సాధించిన ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది.

వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా సాధించింది. జపాన్ లో రన్ కొనసాగుతుండగా ఈ ఫిగర్ మరింత పెరగనుంది. దర్శకుడు రాజమౌళి 1920 నేపథ్యంలో ఫిక్షనల్ స్టోరీగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. డివివి దానయ్య నిర్మించారు. ఎన్టీఆర్ భీమ్, రామ్ చరణ్ అల్లూరి పాత్రలు చేశారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేయగా శ్రియ శరన్ గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిశారు.