https://oktelugu.com/

Game Changer Movie : డివైడ్ టాక్ తో బంపర్ ఓపెనింగ్స్.. బాలీవుడ్ లో #RRR రికార్డ్ అవుట్..అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకుంటున్నారు. #RRR చిత్రానికి కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. మొదటి రోజు ఇక్కడ ఆ చిత్రం కేవలం 17 కోట్లు మాత్రమే రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 10, 2025 / 08:42 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ నుండి ఫ్యాన్స్ షోస్ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, రెగ్యులర్ షోస్ నుండి కామన్ ఆడియన్స్ యావరేజ్ రేంజ్ టాక్ మాత్రమే వచ్చింది. కొంతమంది ఫ్లాప్ అని కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో బాగా దెబ్బ పడింది కానీ, ఇండియా వైడ్ గా మాత్రం దంచికొట్టేసింది. అర్థరాత్రి షోస్ కారణంగా నూన్ మరియు మ్యాట్నీ షోస్ కాస్త తగ్గిపోయాయి కానీ, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ మాత్రం దుమ్ము లేపేసాయి అని చెప్పొచ్చు. బుక్ మై షో యాప్ లో గంటకి 25 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

    హైదరాబాద్, బెంగళూరు వంటి టాప్ సిటీస్ లో రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ మూవీస్ రేంజ్ లో అయితే లేవు కానీ, బాలీవుడ్ లో మాత్రం అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ముంబై, జైపూర్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర సర్క్యూట్స్ లో ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకుంటున్నారు. #RRR చిత్రానికి కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. మొదటి రోజు ఇక్కడ ఆ చిత్రం కేవలం 17 కోట్లు మాత్రమే రాబట్టింది. ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆ రికార్డుని బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. తమిళనాడు లో కూడా బుకింగ్స్ అదిరిపోయాయి. అక్కడి ఆడియన్స్ కి బాగా నచ్చడంతో మ్యాట్నీస్ నుండి ఆక్యుపెన్సీలు అదిరిపోయాయి. ఓవరాల్ గా అయితే తమిళనాడు ప్రాంతం మొత్తం కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం షోస్ వరకు ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. రోజు ముగిసే సమయానికి కచ్చితంగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా థియేట్రికల్ రన్ సంక్రాంతికి విడుదలయ్యే మిగతా రెండు సినిమాల టాక్ మీద ఆధారపడి ఉంటుందని, వాటికి టాక్ రాకపోతే ఆడియన్స్ కి కేవలం గేమ్ చేంజర్ ఒక్కటే ఛాయస్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.