
RRR చిత్రానికి సంబంధించి గ్లామర్ ను పరిచయం చేశాడు రాజమౌళి. రామరాజు సఖిగా నటిస్తున్న అలియాభట్ సీత ఫస్ట్ లుక్ ను ఆమె బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశాడు. ఈ ట్రెమండస్ లుక్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న సీత.. అందమైన చీరకట్టుతో పొందికగా కూర్చొని ఉంది. అచ్చ తెలుగు ఆడపడుచులా సంప్రదాయ బద్ధంగా ఉన్న అలియా సీత రూపం.. ముగ్ధమనోహరంగా ఉంది.
Also Read: ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!
ఈ నేపథ్యంలో అల్లూరి నిజ జీవిత ప్రేమ కథపై.. అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అల్లూరి – సీత మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది? ఏకంగా.. సీతను తనలో కలిపేసుకుని సీతారామరాజుగా మారిపోయిన అల్లూరి ప్రేమ ఎలా ప్రాణం పోసుకుంది? ఆ లవ్ స్టోరీని.. జక్కన్న ఎలా చెక్కుతున్నాడన్నది వెరీ వెరీ ఇంట్రస్టింగ్ పాయింట్ గా మారిపోయింది.
రియల్ లైఫ్ లో చూస్తే.. అల్లూరి పదహారేళ్ల ప్రాయంలో విశాఖలో చదువుకునే రోజుల్లో వీరి ప్రేమ మొగ్గతొడిగిందని చెబుతుంటారు. ఒక శ్రీమంతుడి కుమార్తె అయిన సీతను తొలిచూపులోనే ప్రేమించాడట అల్లూరి. కానీ.. మన దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థ.. ఆర్థిక అంతరం.. అల్లూరి ప్రేమకు సైతం అడ్డుపడిందని చెబుతారు. ఈ క్రమంలో సీత కోసం ఎంతో వేదనకు గురయ్యాడట అల్లూరి. హృదయంలో సీతకు గుడికట్టుకొని, ఆమెను దక్కించుకోలేక యాతన అనుభవించాడట.
Also Read: చిరంజీవితో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ అదరనుందట..!
అదే సమయంలో బ్రిటీష్ మూకల అరాచకాలు పెచ్చుమీరడంతో అల్లూరి సీతారామరాజు వారిపై యుద్ధం ప్రకటించాడు. తన చుట్టూ ఉన్న అమాయక గిరిజనులు, పరిమిత వనరులతోనే.. ప్రపంచ సామ్రాజ్య శక్తిగా ఉన్న బ్రిటీష్ సైన్యాన్ని ఢీకొట్టాడు. అదికూడా కేవలం పాతిక సంవత్సరాల వయసులోనే! అయితే.. ఇటు సీతను మాత్రం మరిచిపోలేకపోయాడు. ఆ విధంగా.. అల్లూరి రామరాజుగా ఉన్న మన్యం వీరుడు.. సీతను తన గుండెల్లోనే కాదు, తన పేరులోనే కలిపేసుకొని సీతారామరాజుగా మారిపోయాడు! చివరి వరకు ఆమెను తలుచుకుంటూ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.
ఇటు సీత కూడా తన రామరాజును మరిచిపోలేకపోయింది. ఎప్పటికైనా తన రాజు వస్తాడని, తనతోపాటు తీసుకెళ్లిపోతాడని ఎదురు చూస్తూ ఉండేదట. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ కథను ఇప్పుడు.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎలా ఆవిష్కరించాడోనన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా.. సీత ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి, అభినవ అల్లూరి సీతగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అక్టోబరు 13 తర్వాత వెండితెరపై వీక్షించాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.