https://oktelugu.com/

Lavanya Tripati-Varunu Tej : రాయల్ ఫ్యామిలీ వందల కోట్ల ఆస్తి… లావణ్యను పెళ్లి చేసుకోవడం వెనుక రీజన్ ఇదా?

లావణ్యకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అని ఓ ఇంటర్వ్యూలో అన్నాడట. దీనికి సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన కామెంట్స్ పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 

Written By:
  • Shiva
  • , Updated On : June 11, 2023 / 08:23 AM IST
    Follow us on

    Lavanya Tripati-Varunu Tej : హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి బంధం వైపు అడుగులు వేశారు. వారి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు. రామ్ చరణ్, చిరంజీవి వారి సతీమణులతో పాటు నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యింది. 

     
    అయితే లావణ్యను కోడలిగా తెచ్చుకోవడం వెనుక పెద్ద యుద్ధమే ఉందంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాత లావణ్య-వరుణ్ ల వివాహం మీద ఆసక్తికర కామెంట్స్ చేశారని అంటున్నారు. సదరు నిర్మాత మాటల ప్రకారం లావణ్యను వరుణ్ తేజ్ వివాహం చేసుకోవడానికి కారణం ఆమెది రాయల్ ఫ్యామిలీ కావడమేనట. లావణ్యకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అని ఓ ఇంటర్వ్యూలో అన్నాడట. దీనికి సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన కామెంట్స్ పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 
     
    ఈ లెక్కలు పక్కన పెడితే ఏడేళ్ల క్రితం మిస్టర్ మూవీలో కలిసి నటించిన వరుణ్ తేజ్-లావణ్య ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. స్నేహంగా మొదలైన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే వీరి రిలేషన్ 2020 వరకు బయటపడలేదు. నిహారిక వివాహానికి లావణ్య హాజరుకావడం అనుమానాలకు బీజం వేసింది. అనంతరం ఆరా తీస్తే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. రెండేళ్లుగా వరుణ్ తేజ్- లావణ్యల వివాహ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
     
    ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య త్రిపాఠి ఈ వార్తలను ఖండించడం విశేషం. సడన్ గా నిశ్చితార్థం ప్రకటన చేసి చేసి షాక్ ఇచ్చారు. ఇక లావణ్య అందాల రాక్షసి మూవీలో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ చిత్రాల్లో లావణ్య నటించారు. ఈ మధ్య ఆమె కెరీర్ నెమ్మదించింది. ఇక వరుణ్ తేజ్ గత చిత్రం గని నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున మూవీ చేస్తున్నారు. అలాగే కొత్త దర్శకుడితో మరో చిత్రంలో చేస్తున్నారు.