https://oktelugu.com/

Roshan Kanakala: తన పుట్టుక గురించి మాట్లాడి యాంకర్ సుమను ఏడిపించిన కొడుకు! వీడియో వైరల్!

ఉంగరాల జుట్టుతో నల్లగా ఉన్న రోషన్ పై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశారట. ఇతడు హీరో ఏంటని, తన శరీర రంగు గురించి ఎగతాళి చేశారట. బాడీ షేమింగ్ కి పాల్పడ్డారన్న రోషన్, విమర్శకుల నోళ్లు మూపించే ప్రయత్నం చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 25, 2023 / 06:22 PM IST

    Roshan Kanakala

    Follow us on

    Roshan Kanakala: యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో గెస్టులుగా అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ సంచలన కామెంట్స్ చేశాడు.

    ఉంగరాల జుట్టుతో నల్లగా ఉన్న రోషన్ పై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశారట. ఇతడు హీరో ఏంటని, తన శరీర రంగు గురించి ఎగతాళి చేశారట. బాడీ షేమింగ్ కి పాల్పడ్డారన్న రోషన్, విమర్శకుల నోళ్లు మూపించే ప్రయత్నం చేశాడు. బబుల్ గమ్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

    నేను చాలా సార్లు విన్నాను, నా వెనకాల మాట్లాడటం చూశాను, చాలా ఆర్టికల్స్ చదివాను. అరే వీడు హీరోనా .. వీడేంటి మస్త్ కర్రెగా ఉన్నాడు వీడు హీరో ఏంటి. హీరో ముఖం కాదు, బొక్కా… వేస్ట్ .. హీరో మెటీరియల్ కాదు అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లెన్ మాత్రమే నిర్ణయిస్తుంది.

    మనందరి జాతకంలో ఏం రాసి పెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా, ఔకాద్ అయినా, ఒక రోజు వస్తది .. వద్దనుకున్నా వినబడతా. 29న రాసిపెట్టుకోండి .. థియేటర్ కి వచ్చేయండి. ఆది గాడి లవ్ ని చూడండి, ఆది గాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ను చూడండి అంటూ చెప్పాడు. అయితే కొడుకు అంత ధైర్యంగా మాట్లాడటం చూసి ఎమోషనల్ అయిన సుమ కన్నీళ్లు పెట్టుకుంది.