Romantic: ఆకాశ్‌పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ స్వరాలు అందించారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సునీల్ కశ్యప్. ఈ క్రమంలోనే రొమాంటిక్ భావోద్వేగభరితంగా ఉంటుందని, ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని తెలిపారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
నటన విషయంలో ఆకాశ్ మరోమట్టు ఎక్కించే చిత్రం రొమాంటిక్ అని కశ్యప్ అన్నారు. సినిమా ఇంటర్వెల్ తర్వాత వచ్చే పార్ట్ అంతా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ సాధారణంగా కన్నీరు పెట్టుకోరని కానీ, ఈ సినిమా చూశాక ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయని కశ్యప్ అన్నారు. అప్పుడే తన పనిపట్ల నమ్మకం వచ్చిందని వివరించారు. కథ విని, రొమాంటిక్ అనే టైటిల్ డిసైడ్ చేశాక.. దానికి తగ్గట్లు మైండ్‌సెట్‌ను మార్చుకుని పాటలు కంపోజ్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ కేతిక శర్మ కూడా ఓ పాట పాడిందని అన్నారు.
ఈ క్రమంలోనే తన భవిశ్యత్ ప్రణాళికలపై ముచ్చటించిన కశ్యప్.. సినిమాలతో పాటు, క్లాసికల్ సంగీతం వైపు కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తున్న గాడ్సే సినిమాకు స్వరాలు అందిస్తున్నారు కశ్యప్. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఆయన చేతుల్లో ఉన్నాయి. మెహబూబా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆకాశ్ పూరి ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలంటే అక్టోబరు 29 వరకు వేచి చూడాల్సిందే.