Romantic Movie: దర్శకుడు పూరి జగన్నాధ్ కి ప్రభాస్ కి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇద్దరూ రెగ్యులర్ గా కలుసుకోరు.కానీ కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటారు. పూరి అంటే ప్రభాస్ ఓ ప్రత్యేక అభిమానం ఉంది. ప్రభాస్ అంటే.. మంచోడు, అడగకపోయినా సాయం చేస్తాడు అనే అభిప్రాయం ఉంది పూరికి. మొత్తానికి ఈ అభిమానం – అభిప్రాయాల మధ్య పూరి కొడుకు ఆకాష్ కోసం ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. తన సినిమా ప్రమోషన్స్ లోనే సరిగ్గా కనిపించని ప్రభాస్.. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం యాక్టివ్ గా కనిపించాడు.

ప్రమోషన్ అంటే.. ఏదో ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. కోట్ల విలువ చేసే తన ఒక ఫుల్ డే కాల్ షీట్ ఇచ్చి.. చివరకు హీరోహీరోయిన్లను ఇంటర్వ్యూ కూడా చేశాడు. మొదట రొమాంటిక్ టీజర్ ను ప్రభాస్ తన చేతుల మీదగానే విడుదలచేశాడు. దాంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. అప్పటి వరకు రెగ్యులర్ సినిమాలా ఏ మాత్రం అంచనాలు లేని రొటీన్ సినిమాలా అనిపించింది ఈ సినిమా.
కానీ ప్రభాస్ రిలీజ్ చేసిన టీజర్ జనంలోకి బాగా వెళ్ళింది. అలాగే టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ జరిపిన చిట్ చాట్ వ్యవహారం కూడా జనానికి బాగా నచ్చింది. ప్రభాస్ చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ టాప్ ట్రెండ్ లో వుంది. అసలు పూరికి సాయం చేయాల్సిన అవసరం ప్రభాస్ కి లేదు. ఎందుకంటే.. పూరి- ప్రభాస్ లు కలిసి చేసిన ‘ఎక్ నిరంజన్’ పెద్ద డిజాస్టర్ అయింది.
ఇక ‘బుజ్జిగాడు’ అనే సినిమా మాత్రం ఏవరేజ్ గా ఆడింది. పూరి సూపర్ హిట్లు ఇచ్చిన హీరోలు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ పూరికి ఇలాంటి సాయం చేయలేదు. ఆ మధ్య ఎన్టీఆర్ మాత్రం సాయం చేసినట్టు ఉన్నాడు. ఇక మహేష్ బాబు, చరణ్, రవితేజ ఇలా కొంతమంది హీరోలకు పూరి సూపర్ హిట్స్ ఇచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం చిన్న ట్వీట్ పెట్టడానికి ఎప్పుడు ఆసక్తి చూపించలేదు.
కానీ ప్రభాస్ మాత్రం ఒక కాల్ షీటు ఇచ్చేసాడు. నిజానికి ప్రభాస్ కాల్ షీటు విలువ ఏడు అంకెల్లో ఉంటుంది. ప్రభాస్ చిన్న ట్వీట్ చేస్తే కోట్లు కుమ్మరించడానికి చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడు యాడ్స్ ప్రమోషన్స్ కి ఆసక్తి చూపించలేదు. కేవలం రొమాంటిక్ ప్రమోషన్స్ ను పూరి కోసం చేశాడు.
Also Read: Samantha: కుమార్తె పెళ్లి కోసం కాదు… ఆమె చదువు కోసం డబ్బు దాచి పెట్టండి : సమంత