https://oktelugu.com/

Minister Rk Roja: రోజా రీ ఎంట్రీ.. దసరాకు జబర్దస్త్‌ స్టేజీపై సందడి చేయనున్న ఫైర్‌బ్రాండ్‌!

Minister Rk Roja: ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖ మంత్రి రోజా. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఆంధ్రప్రద్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఒకవైపు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటూ, అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు బుల్లితెరపై సందడి చేస్తున్న సమయంలో మంత్రిపదవి వరించింది. దీంతో ఆమె బుల్లితెర షోలకు గుడ్‌బై చెప్పారు. జబర్దస్త్‌ కార్యక్రమంతో సుదీర్ఘకాలం బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఆమె మంత్రి పదవి రావడంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 20, 2022 / 03:59 PM IST
    Follow us on

    Minister Rk Roja: ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖ మంత్రి రోజా. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఆంధ్రప్రద్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఒకవైపు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటూ, అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు బుల్లితెరపై సందడి చేస్తున్న సమయంలో మంత్రిపదవి వరించింది. దీంతో ఆమె బుల్లితెర షోలకు గుడ్‌బై చెప్పారు. జబర్దస్త్‌ కార్యక్రమంతో సుదీర్ఘకాలం బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఆమె మంత్రి పదవి రావడంతో టీవీ షోలకు పర్తిగా దూరమయ్యారు. జబర్దస్త్‌ అభిమానులు ప్రేక్షకులు కూడా రోజాని మిస్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

    Minister Rk Roja

    హీరోయిన్‌గా ఒక రేజ్‌.. జబర్దస్త్‌తో మరో రేంజ్‌..
    రోజా హీరోయిన్‌గా చిన్న హీరోలతో ఎంట్రీ ఇచ్చారు. తన ప్రతిభ, నటనపై ఉన్న మక్కువతో అనతికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేశారు. అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత సినమాలు తగ్గించారు. హీరోయిన్‌గా కాకుండా అక్క, అమ్మ పాత్రలు చేస్తున్నారు. దశాబ్దకాలంగా ఈటీవీ కామెడీ షో జబర్దస్త్‌ జడ్జిగా వ్యవహరించారు. హీరోయిన్‌గా ఎంత క్రేజ్‌ తెచ్చుకున్నారో.. బుల్లితెరపై కూడా అంతే క్రేజ్‌ సంపాదించారు రోజా. ఆమె లేని లోటు జబర్దస్త్‌ లో కనిపిస్తుందని జబర్దస్త్‌ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఆమెకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రోజా జబర్దస్త్‌ నుంచి ఆమె వెళ్లి పోయిన తర్వాత చాలా మంది కమెడియన్స్‌ కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లి పోయారు.

    Also Read: Anchor Vishnu Priya: ఆ యాంకర్ తప్ప తాగి చిందులు వేసింది.. ఆ స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారట

    మంత్రి పదవి కారణంగా దూరం..
    మంత్రి పదవి అరుదుగా వచ్చే అవకాశం. ఎన్నాళ్లుగానో రాజకీయాల్లో ఉన్న రోజా ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అందివచ్చిన అవకాశం కోసం జబర్దస్త్‌ను వదులుకుఆన్నరు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు జబర్దస్త్‌ స్టేజీపై కనిపించ లేదు. ఎట్టకేలకు ఆమె ఈటీవీ లో తిరిగి కనిపించబోతోంది.

    Minister Rk Roja

    ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ..
    దసరా సందర్భంగా టెలికాస్ట్‌ కాబోతున్న ప్రత్యేక కార్యక్రమంలో రోజా సందడి చేయబోతున్నారు. షోకు సబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్‌ అయింది. దీనిపై రోజా కూడా క్లారిటీ ఇచ్చారు. షోలో చేసినట్లు తెలిపారు. దీంతో ఆమె రెగ్యులర్‌ గా ఈటీవీ కార్యక్రమాలకు వస్తారు అని కొందరు భావిస్తున్నారు. కానీ మంత్రిగా ఉన్న ఆమె కేవలం దసరా ఎపిసోడ్‌ లో మాత్రమే కనిపించబోతున్నారని , ముందు ముందు జబర్దస్త్‌ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె కనిపించబోదని బుల్లితెర వర్గాలవారు క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఆమె రాజకీయ పరిస్థితిని బట్టి జబర్దస్త్‌లో చేసేది లేనిది క్లారిటీ ఉండే అవకాశం ఉందని కొంతమంది పేర్కొంటున్నారు. మొత్తానికైతే ఈటీవీలో అప్పుడప్పుడైనా ఇలా గెస్ట్‌గా రోజా రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. రోజా అభిమానులు, జబర్దస్త్‌ యొక్క ఫ్యాన్స్‌ రోజా రీఎంట్రీని స్వాగతిస్తున్నారు. దసరా ఎపిసోడ్‌ కోసం ఈటీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత రోజా రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తప్పకుండా ఆమెకు గ్రాండ్‌ వెల్కమ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున సక్సెస్‌ చేస్తారని ఈటీవీ యాజమాన్యం, మల్లెమాల సంస్థ భావిస్తోంది.

    Also Read:Allu Arjun: అల్లు అర్జున్ మాటతో ట్రెండింగ్ లోకి ఆ అమ్మాయి ?, ఇంతకీ ఎవరు ఆమె ? ఎక్కడ నుంచి వచ్చింది ?

    Tags