Roja Selvamani daughter Anshu Reddy : ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి రోజా(Roja Selvamani) రాజకీయాల్లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ, ప్రత్యర్థులపై లేడీ టైగర్ లాగా విరుచుకుపడుతూనే ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమె ప్రస్తుతం ప్రతిపక్షం లో ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు ప్రత్యర్థులపై ఎలా అయితే ఆమె విరుచుకుపడేదో, ఇప్పటికీ అదే ధోరణి చూపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈమెకు అన్షు రెడ్డి అనే కూతురు ఉంది. ఈమె చూసేందుకు అచ్చు గుద్దినట్టు హీరోయిన్ లాగానే ఉంటుంది. తల్లి ని మించిన అందంతో ఉన్న ఈమె , కచ్చితంగా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అంటూ సోషల్ మీడియా లో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అంతే కాకుండా ఈమె ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఈ విషయం పై ఆమె తల్లి రోజా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. ముందుగా రిపోర్టర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కూతురు ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి , నిజమేనా ?’ అని అడగ్గా, అందుకు రోజా సమాధానం చెప్తూ ‘అందులో ఎలాంటి నిజం లేదు. స్టార్ హీరోకి కోడలుగా వెళ్లబోతుంది అన్నారు కదా, ఆ స్టార్ హీరో ఎవరో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ప్రస్తుతం నా కూతురు ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉంది. పెళ్లి సంబంధాలు ఇప్పుడు మేమేమి చూడలేదు. సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కూడా ఆమెకు లేదు. ప్రస్తుతం ఆమె విదేశాలకు వెళ్ళింది. ఇది యాక్టింగ్ కోసమో, లేదంటే డ్యాన్స్ నేర్చుకోవడం కోసమో కాదు, పై చదువుల కోసం వెళ్ళింది. నా కూతురు చదువులో గొప్ప ప్రావిణ్యం ఉన్న అమ్మాయి ‘ అంటూ చెప్పుకొచ్చింది.
చిన్న తనం నుండి అన్షు చదువులో గొప్ప స్థాయిలోనే కొనసాగుతూ వచ్చింది. స్కూల్ డేస్ నుండి కాలేజ్ డేస్ వరకు ఆమె తన ప్రతిభ ని చాటుతూ ఎన్నో గోల్డ్ మెడల్స్, అవార్డ్స్ ని కైవసం చేసుకుంది. అంతే కాదు పేద విద్యార్థులను చదివించడం లో కూడా అన్షు ఎప్పుడూ ముందు ఉంటుంది. చిన్న వయస్సులోనే ఒక పాపులర్ పుస్తకానికి రచయితగా కూడా వ్యవహరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈమె గురించి మాట్లాడినప్పుడల్లా రోజా ముఖం లో ఎదో తెలియని గర్వం , విజయోత్సాహం కనిపిస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈమె ఇంకా ఎంత ఉన్నారా స్థాయికి వెళ్లబోతుందో చూడాలి.