Robin Hood : హీరో నితిన్(Hero Nithin) ని చూస్తే ఎవరికైనా పాపం అని జాలి వేస్తుంది. ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, దాదాపుగా కెరీర్ ముగిసిపోయే సమయానికి మళ్ళీ భారీ కం బ్యాక్ ని ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కం బ్యాక్ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ కరోనా తర్వాత ఈ హీరోకి అసలు ఏమి కలిసి రావట్లేదు. ‘భీష్మ’ చిత్రం థియేటర్స్ లో అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే కరోనా మహమ్మారి మన రాష్ట్రంలోకి రావడం మొదలు పెట్టింది. దీంతో జన సమాచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు మొత్తం క్లోజ్. అందులో భాగంగానే థియేటర్స్ ని మూసేసారు. ఇక భీష్మ తర్వాత విడుదలైన ‘రంగ్ దే ‘ చిత్రం బాగున్నప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ దీనిపై చాలా గట్టిగా పడింది. దాంతో యావరేజ్ రేంజ్ తో సరిపెట్ట్టుకోవాల్సి వచ్చింది.
Also Read : ‘రాబిన్ హుడ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యం..2 రోజుల్లో వచ్చింది ఎంతంటే!
ఇక ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలు ఎంత పెద్ద ఘోరమైన డిజాస్టర్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత నితిన్ చేసిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం ఇటీవలే గ్రాండ్ గా విడుదలైంది. గతంలో ఆయనకు భీష్మ లాంటి కమర్షియల్ హిట్ ని అందించిన వెంకీ కుడుముల(Venky Kudumula) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నితిన్ చాలా బలంగా నమ్మాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశపర్చింది. కంటెంట్ యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) మేనియా లో కొట్టుకుపోయింది ఈ చిత్రం. విడుదలకు ముందే హైప్ ని క్రియేట్ చేయలేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఉగాది రోజున అయినా ఈ సినిమా పికప్ అవుతుందని అందరూ అనుకున్నారు.
అందరూ అనుకున్నట్టుగానే పికప్ అయ్యింది. రెండవ రోజు 29 వేల టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతే, మూడవ రోజు అనగా ఉగాది రోజున 31 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ పికప్ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఏమాత్రం కూడా సరిపోదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజున కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి విడుదలకు ముందు 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, కేవలం 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు రంజాన్ కావడంతో, నేడు కూడా నిన్న వచ్చిన వసూళ్లే రావొచ్చు. ఓవరాల్ గా క్లోజింగ్ లో పది కోట్ల రూపాయిల షేర్ కి మించి వచ్చేలా కనిపించడం లేదు.
Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..నితిన్ కెరీర్ లోనే వరస్ట్!