Homeఎంటర్టైన్మెంట్NTR: బ్లాక్ సూట్ లో జేమ్స్ బాండ్ లా... కాకరేపుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్!

NTR: బ్లాక్ సూట్ లో జేమ్స్ బాండ్ లా… కాకరేపుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్!

NTR: ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఏకంగా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కూడిన ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది. అంతర్జాతీయ సినిమా వేదికలపై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించారు. హాలీవుడ్ మీడియా ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించాయి. దేవరతో మరో హిట్ ఎన్టీఆర్ ఖాతాలో వేసుకున్నాడు.

దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో సైతం చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రాబట్టింది. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల వరకు వసూలు చేసింది. రాజమౌళి సినిమా తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ పడాల్సిందే అనే బ్యాడ్ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ అధిగమించడం విశేషం. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మొదటి హీరో ఎన్టీఆర్ అయ్యాడు. వరుస విజయాలతో జోరు మీదున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ చేస్తున్న మరో మల్టీస్టారర్ వార్ 2. హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నాడు.

వార్ 2 షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. అక్కడ ఓ బడా ఫ్యామిలీ మ్యారేజ్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుండి చాలా మంది సెలెబ్స్ హాజరయ్యారు. మహేష్ వైఫ్ నమ్రత, సితార, అఖిల్ అక్కినేని, రామ్ చరణ్ తో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు పెళ్ళిలో సందడి చేశారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి సైతం వెళ్లారు.

దుబాయ్ పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్స్ సందడి చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ లుక్ సైతం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ ధరించి జేమ్స్ బాండ్ రేంజ్ లో దర్శనం ఇచ్చాడు. ఈ లుక్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ కోసమా? అని పలువురు భావిస్తున్నారు. కానీ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ ఈ డిజైనర్ వేర్ ధరించడాని తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
వార్ 2 షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

Exit mobile version