Ritu Varma: నాగ శౌర్య హిట్ కోసం కోటి ఆశలతో రీతూ వర్మతో కలిసి చేస్తున్న సినిమా ‘వరుడు కావలెను’. సినిమా అవుట్ ఫుట్ పై ఇప్పటికే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా బాగా స్లో నేరేషన్ ఉందని.. ఎక్కడా ఇంట్రెస్ట్ కలిగించే ప్లే లేదని.. దీనికితోడు అనవసరమైన బిల్డప్ సీన్స్ ఎక్కువ అయిపోయాయని.. ఇక డైలాగ్స్ అయితే బుక్స్ చూసి రాశారనే టాక్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. అందుకే సినిమాకి బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. నాలుగు రోజుల ముందు నుంచే హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా హడావిడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రీతూ వర్మ భూమి అనే అమ్మాయి పాత్రలో నటించింది. కాగా రీతూ వర్మ ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే ‘ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాదు’ నాగ శౌర్య హీరో కాబట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని ఎవరు అనుకుంటారు ?
‘కాకపోతే, ఇది మంచి ప్రేమకథా చిత్రం. నాగ శౌర్యతో పాటు నాకు కూడా బలమైన పాత్రలు దక్కాయి. సినిమా కథ అంత గొప్పగా ఉంటుంది. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్యగారు కథను బాగా రాసుకున్నారు. ఆమె ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది’ అంటూ రీతూ వర్మ చెప్పింది. అంటే నచ్చకపోతే సినిమా చేయదా ? అసలుకే అమ్మడికి అవకాశాలు తక్కువ. దీనికితోడు ఈ ఓవర్ డైలాగ్స్ అవసరమా ?
అన్నట్టు ఇంటర్వ్యూలో ఏదైనా సంగతులు చెప్పవమ్మా రీతూ వర్మ అంటే.. హీరోయిన్లకు ఇలాంటి రోల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి’ అని చెప్పింది. అబ్బా.. ఈ మాట ఈ బ్యూటీ చెప్పగానే జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలనిపించింది. సినిమాలో ఆమె పాత్ర బాగా బోరింగ్ అని ఒకపక్క టాక్ నడుస్తుంటే.. ఇలాంటి సమయంలో తన పాత్ర గురించి ఈ లేనిపోని హైప్ లు క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ?
Also Read: Anand Devarakonda: రిలీజ్ డేట్ లో నో ఛేంజ్ అంటున్న” పుష్పక విమానం ” టీమ్ …
అన్నిటికీ మించి ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. మొత్తానికి మొత్తం ఆడవాళ్లను ఆలోచనలను కూడా వాడేసుకుంది అన్నమాట. ఇక తానూ పోషించిన భూమి క్యారెక్టర్ తెలుగులో వచ్చిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందట. వామ్మో.. రీతూలో ఈ రేంజ్ కోతల రాణి ఉందని ఊహించలేదు అంటున్నారు నెటిజన్లు. ఇక నాగ శౌర్యతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందట. ఈ ముక్క చెప్పాల్సింది సినిమా చూసిన ప్రేక్షకులు తల్లీ.
Also Read: Mahesh Babu: మహేష్ కి పాన్ ఇండియా బడ్జెట్ లేకపోతే ఎలా ?