Ritu Chowdhury : సోషల్ మీడియా ద్వారా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఒకరు రీతూ చౌదరి(Ritu Chowdary). ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలు ఎంత వైరల్ అవుతుంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీరియల్స్ లో విలన్ గా ఈమె తెలుగు ఆడియన్స్ కి ఎప్పటి నుండో సుపరిచితమే. మధ్యలో ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా అలరిస్తూ ఉంటుంది. ఇలా తెలుగు ఆడియన్స్ కి ఈమె ఎప్పటి నుండో సుపరిచితమే, ఈటీవీ లో ప్రతీ వారం ప్రసారం అయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో కూడా ఈమె హైపర్ ఆది టీం లో ఒకప్పుడు కనిపించింది. ఇక ఈ ఏడాది ప్రారంభం లో ఈమెపై 700 కోట్ల రూపాయిల స్కాం అభియోగాలు కూడా వచ్చాయి. దానిపై ఈమె స్పష్టత కూడా ఇచ్చింది, తన మాజీ భర్త కి సంబంధించిన వ్యవహారమని, ఇప్పుడు నేను అతనితో కలిసి కూడా ఉండట్లేదని చెప్పుకొచ్చింది.
Also Read : డబ్బు కోసమే అలా చేశా..గుడ్డిగా అతన్ని నమ్మి మోసపోయాను అంటూ రీతూ చౌదరి కన్నీళ్లు!
ఇక రీసెంట్ గా ఈమె బెట్టింగ్ యాప్స్ వివాదం లో కూడా చిక్కుకుంది. ఇలా గత కొంతకాలం ఎదో ఒక విషయం లో ట్రెండింగ్ అవుతూ వస్తున్నా రీతూ చౌదరి, రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన తండ్రి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నాతో ఎప్పుడూ నాన్న లాగ ప్రవర్తించలేదు, ఒక
ప్రాణ స్నేహితుడిగా ఉండేవాడు. నాకు ఏమి కావాలని అనిపించినా వెంటనే నాన్న ని అడిగేదానిని, నా ప్రైవేట్ విషయాలను కూడా నాన్న తో పంచుకునే దానిని, నేను మా నాన్న ని ఒరేయ్ అని పిలుస్తుంటాను, ఆయనతో కూర్చొని ఎన్నో సార్లు మందు కూడా కొట్టాను, ఇక మీరే అర్థం చేసుకోండి, మా నాన్నతో నాకు ఎలాంటి బాండింగ్ ఉంది అనేది’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న చనిపోయిన ఘటనకు మించి నేను బాధపడే సంఘటనలు ఏమి జరగలేదు. భవిష్యత్తులో జరగవు కూడా. అందుకే నాపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, నన్ను ఎంత మంది తిట్టుకున్నా, కేవలం నవ్వి ఊరుకుంటాను తప్ప, మనసుకు తీసుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే వెళ్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రీతూ చౌదరి సమాధానం చెప్తూ ‘గత రెండు సీజన్స్ కి అడిగారు, మనకి సెట్ అవ్వదేమో అని వెళ్ళలేదు, ఈసారి అవకాశం వస్తే ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. ప్రస్తుతానికి తనకు ఎలాంటి అవకాశాలు రావడం లేదని, పని లేదు అనే డిప్రెషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది అంటూ రీతూ చౌదరి ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
Also Read : తనపై వచ్చిన ఆరోపణలపై రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్..ఇంత పొగరు సమాధానం ఊహించి ఉండరు!
