https://oktelugu.com/

Ritu Choudhary : రీతూ చౌదరి జబర్దస్త్ మానేయడం వెనక అతడి హస్తం… ఎట్టకేలకు కారణం బయటపెట్టిన హాట్ యాంకర్!

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి జబర్దస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేసేది. జబర్దస్త్ మానేయడం వెనుక కారణం ఏమిటో ఎట్టకేలకు బహిర్గతం చేసింది రీతూ చౌదరి. ఓ వ్యక్తి వలన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశానని ఓపెన్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 03:41 PM IST
    Follow us on

    Ritu Choudhary :  రీతూ చౌదరి జబర్దస్త్ లేడీ కమెడియన్ గా సుపరిచితమే. ఆమె హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేసేది. ఇక హైపర్ ఆది జబర్దస్త్ షోతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఈటీవీలో షోలు, ఈవెంట్లు చేసుకునే స్థాయి నుంచి సినిమాల్లో పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ చేసే రేంజ్ కి వచ్చాడు. ప్రస్తుతం ఈటీవీలో హైపర్ ఆది హవా నడుస్తోంది. ఏ షోలో చూసినా ఆది సందడి కనిపిస్తుంది. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తూ తన స్పాంటేనియస్ పంచులతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే హైపర్ ఆది ఒక్కోసారి కామెడీ పేరుతో తోటి ఆర్టిస్టులపై హద్దులు మీరి పంచులు వేస్తుంటాడు.

    బాడీ షేమింగ్ కి పాల్పడుతుంటాడు. యాంకర్స్ తో పాటు అప్పుడప్పుడు జడ్జెస్ కూడా బలి అవుతుంటారు. ఒకానొక సమయంలో యాంకర్ అనసూయ జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. డ్రెస్సింగ్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారని వాపోయింది. జబర్దస్త్ మానేయడానికి అది కూడా ఒక రీజన్ అని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాజాగా మరో లేడీ కమెడియన్ రీతూ చౌదరి తాను హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశానని అంటుంది.

    ఒకప్పటి సీరియల్ నటి రీతూ చౌదరి.. జబర్దస్త్ ద్వారా ఫేమ్ రాబట్టింది. హైపర్ ఆది టీం లో స్కిట్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. అలా కొంతకాలం ఈటీవీలో సందడి చేసింది. అనూహ్యంగా రీతూ చౌదరి జబర్దస్త్ ను వీడింది. టీవీ షోలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది.

    ఇటీవల యాంకర్ గా అవతారమెత్తింది. దావత్ అనే షో హోస్ట్ చేస్తుంది. రీతూ దావత్ షోలో జబర్దస్త్ మానేయడం పై స్పందించింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ .. నేను ఆది కలిసి జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేశాం. ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాక, నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను. ఆది వెళ్లిపోయాక నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆది జబర్దస్త్ వీడిన కొన్ని రోజులకు నేను కూడా బయటకు వచ్చేశాను, అని అన్నది. ఆది జబర్దస్త్ మానేయడం వలన తాను కూడా ఆ షోకి దూరమైనట్లు క్లారిటీ ఇచ్చింది.

    మరోవైపు రీతూ చౌదరి బిగ్ బాస్ తెలుగు 8కి ఎంపికైంది అంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుండి కొత్త సీజన్ ప్రసారమయ్యే ఆస్కారం కలదు. ఆల్రెడీ బిగ్ బాస్ 8 లోగో విడుదల చేశారు. త్వరలో షో ప్రసారం అవుతుందని హింట్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి చేశారట. కంటెస్టెంట్స్ లిస్ట్ లో రీతూ కూడా ఉన్నారట. సోషల్ మీడియాలో పొట్టిబట్టల్లో రచ్చ చేసే రీతూ చౌదరి హౌస్లోకి వస్తే రచ్చ రచ్చే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ ప్రియులు మాత్రం రీతూ చౌదరి సోయగాలను పిచ్చగా ఎంజాయ్ చేయనున్నారు.