Ritu Chowdary: జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదట్లో ఈమె సీరియల్స్ లో నటించారు. ఆశించిన గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది టీం లో ఎక్కువగా కనిపించేది. ఇతర టీంలతో కూడా పని చేసింది. రీతూ చౌదరి జబర్దస్త్ షో వేదికగా కొంత ఫేమ్ తెచ్చుకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా ఆమె పాపులర్ అయ్యారు. కారణం తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. పరువాల ప్రదర్శనలో అసలు మొహమాటపడదు.
కాగా రీతూ చౌదరి ఇంట్లో ఈ ఏడాది విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి హఠాన్మరణం పొందాడు. తండ్రి మరణం ఆమెను కృంగదీసింది. ఆయనతో రీతూ చౌదరికి గట్టి అనుబంధం ఉన్న క్రమంలో చావును జీర్ణించుకోలేకపోయింది. అయితే తండ్రి లేని కారణంగా తాను మోసాలకు గురవుతున్నాని, ఆర్థికంగా మానసికంగా ఒత్తిడి ఎదుర్కుంటున్నానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.
రీతూ చౌదరి కొత్తగా ఇంటిని నిర్మించుకుంటుందట. ఇంటీరియర్ వర్క్ ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చిందట. అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు అతడు తీసుకున్నాడట. డబ్బులు తీసుకున్న ఆ కాంట్రాక్టర్ సరిగా పని చేయించలేదట. ముందుగా అనుకున్నట్లుగా గా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడట. సగం సగం పనులు చేస్తుంటే నచ్చక నిలదీసిందట. పని పూర్తిగా చేయకపోగా డబ్బులు అడిగితే వాపస్ ఇవ్వడం లేదట. పైగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడట.
చేసేది లేక కేసు పెట్టడంతో రూ. 3 లక్షలు తిరిగి ఇచ్చాడట. అతన్ని నమ్మి పూర్తిగా మోసపోయాను. నాన్న మరణించడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంటిని పూర్తి చేసే క్రమంలో మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నానని రీతూ చౌదరి యూట్యూబ్ లో వీడియో షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది. రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతన్ని ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు సమాచారం.