Ritu Chaudhary: బిబి జోడీ సీజన్ 2 పేరుతో వస్తున్న ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని భాగం చేసి షో ను నిర్వహిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 9 లో మంచి గుర్తింపును సంపాదించుకున్న డిమాన్ పవన్ రీతూ చౌదరిలను జోడిగా చేశారుమ్. నిజానికి ఆ షోలో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే వీళ్ళిద్దరి జోడి కే మంచి రెస్పాన్స్ వస్తుంది…ఇక ఈ షో కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక అందులో డీమాన్ పవన్ రీతు చౌదరి ఇద్దరు ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలోని ‘ఏ వచ్చి బి పై వాలే’ అనే సాంగ్ మీద డాన్స్ చేశారు. దానికి మిగతా కంటెస్టెంట్స్ అందరు కేవలం రెండు మూడు మార్కులు మాత్రమే ఇవ్వడంతో రీతు చౌదరి ఒక్కసారిగా వాళ్ళందరి మీద ఫైర్ అయింది…
ఎంత మంచిగా డాన్సు వేసినా కూడా మీరు ఏదో ఒక కారణం చెప్పి అంత తక్కువ మార్కులు ఇవ్వడం అనేది సరైనది కాదు… అంటూ ఆమె ఆ షో నుంచి వెళ్ళిపోయారు. నిజానికి రీతి చౌదరి డిమాన్ పవన్ వేసిన స్టెప్పులు ప్రోమోలో అయితే బాగానే ఉన్నాయి. మరి వాళ్లకు ఎందుకు నచ్చలేదు వాళ్ళు ఎందుకని అలాంటి మార్కులు ఇచ్చారు అనేది షో మొత్తం చూస్తేనే క్లారిటీ వస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కూడా అల్లరి చిల్లరిగా ఉంటూ తనకు నచ్చినవి మాట్లాడుతూ నచ్చని విషయాలను ఖండిస్తూ వచ్చింది. ఇక్కడ కూడా తాను అలాగే రెస్పాండ్ అవ్వడం పట్ల పలువురు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, డాన్స్ షో కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండాలి. అలాగే అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని డాన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే అవతలి కంటెస్టెంట్స్ ఇచ్చే విమర్శలను తిప్పికొట్టిన వాళ్లమవుతామంటూ సోషల్ మీడియాలో ఆమె మీద కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ వారం ఈ షో చాలా రసవత్తరంగా సాగబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…