https://oktelugu.com/

వైరల్ అవుతున్న రిషీ కపూర్ చివరి వీడియో

బాలీవుడ్ అగ్రనటుడు రిషీకపూర్ గురువారం మృతిచెందిన విషయం తెల్సిందే. లాక్డౌన్ కారణంగా సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రణబీర్ కపూర్ తన తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించగా కొంతమంది కుటుంబ సభ్యులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రిషీకపూర్ కూతురు రిధిమా కపూర్ సహ్ని తండ్రి చివరి చూపుకు నోచుకోలేకపోయారు. రిషీకపూర్ కూతురు ఢిల్లీలో ఉండటంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ముంబై వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంది. అయితే రోడ్డుమార్గంలో ఆమె […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 30, 2020 / 07:47 PM IST
    Follow us on


    బాలీవుడ్ అగ్రనటుడు రిషీకపూర్ గురువారం మృతిచెందిన విషయం తెల్సిందే. లాక్డౌన్ కారణంగా సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రణబీర్ కపూర్ తన తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించగా కొంతమంది కుటుంబ సభ్యులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రిషీకపూర్ కూతురు రిధిమా కపూర్ సహ్ని తండ్రి చివరి చూపుకు నోచుకోలేకపోయారు. రిషీకపూర్ కూతురు ఢిల్లీలో ఉండటంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ముంబై వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంది. అయితే రోడ్డుమార్గంలో ఆమె 1800కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆమె రేపు ముంబైకు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండే రిషీకపూర్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

    రిషీకపూర్ బుధవారం రాత్రి అనారోగ్యానికి గురవడంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అతడికి చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఒకరు రిషీకపూర్‌ను ఆప్యాయంగా పలకరించి వీడియో తీశాడు. ఈసందర్భంగా అతడు రిషీకపూర్ నటించిన ఓ మూవీలోని ‘తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా’ పాటను పాడి విన్పించారు. ఈ పాట విన్నంత సేపూ రిషీకపూర్ మంచంపైనే పడుకుని నవ్వులు చిందించారు. ఆ వెంటనే ఆ యువకుడికి రిషీకపూర్ తన ఆశీస్సులు అందించారు.

    పుష్ప చిత్రం లో యాక్షన్ సీన్స్ అదరహో

    జీవితంలో కష్టపడి పైకి రావాలని సూచించారు. కష్టపడటమే మన వంతు అని.. పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వస్తాయని రిషీకపూర్ అన్నారు. చివరి క్షణంలో ఆయన చెప్పిన మాటలకు అభిమానులు ఫిదా అవుతోన్నారు. ఆయన చివరి మజిలోనూ ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారని అభిమానులు అంటున్నారు. అయితే ఈ వీడియో గురువారం ఉదయం రికార్డు చేసి ఉండొచ్చని కొందరు అంటుండగా మరికొందరు ఈ ఏడాది ప్రారంభంలో రిషీకపూర్ ఆస్పత్రికి వెళ్లినపుడు ఈ వీడియోను తీసి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా రిషీకపూర్ చివరి మజిలి నవ్వులతోనే సెండాఫ్ ఇవ్వడంతో అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.