Rishabh Shetty : కన్నడ సినీ పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు రిషబ్ శెట్టి(Rishab Shetty). ఈయన కెరీర్ డైరెక్టర్ గానే మొదలైంది, కానీ ‘కాంతారా'(Kantara Movie) చిత్రంతో హీరో గా కూడా మారి కోట్లాది మంది మూవీ లవర్స్ కి తన నట విశ్వరూపం చూపించాడు. ఆయన అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. కాంతారా క్లైమాక్స్ లో ఆయన నటనకు నేషనల్ అవార్డు కూడా తక్కువే. ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్లినా తప్పు లేదు, అంత అద్భుతంగా నటించాడు ఆయన. కర్ణాటక కల్చర్ లో జరుపుకునే పండుగని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసాడు రిషబ్ శెట్టి. కేవలం కన్నడ లోనే కాదు, ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇలాంటి సినిమాకి ప్రస్తుతం ఆయన ప్రీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలకు సీక్వెల్స్ చేసి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు మేకర్స్.
కానీ రిషబ్ శెట్టి కేవలం స్టోరీ డిమాండ్ ని బట్టే ముందుకు వెళ్తున్నాడు. అందుకే ప్రీక్వెల్ (ఫ్లాష్ బ్యాక్ అన్నమాట) చేస్తున్నాడు. ‘కాంతారా’ చిత్రం పెద్ద సంచలనం సృష్టించడంతో, ఈ ప్రీక్వెల్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడం అనేది మాటలు చెప్పినంత ఈజీ కాదు. చాలా కష్టం, అందుకే డైరెక్టర్ గా రిషబ్ శెట్టి తన విజన్ కి తగ్గట్టు నూటికి నూరు శాతం వచ్చేదాకా తగ్గడం లేదట. ఈ సినిమాలో ఒక యుద్ధ సన్నివేశ ఉంటుందట. కథకి ఈ యుద్ధ సన్నివేశం అత్యంత కీలకం. అందుకే తన విజన్ కి తగ్గట్టు ఔట్పుట్ వచ్చే దాకా ఈ సన్నివేశాన్ని తీయడం లో కాంప్రమైజ్ అవ్వలేదట రిషబ్ శెట్టి. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసం ఆయన 50 రోజుల సమయం తీసుకున్నాడట.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం. కేవలం ఒక్క సన్నివేశం కోసం ఇన్ని రోజుల సమయం తీసుకున్నాడంటే, ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. విడుదల తర్వాత ఆ కష్టం వెండితెర పై కనిపించి, అది ఆడియన్స్ కి నచ్చితే, రెండవసారి కూడా నేషనల్ అవార్డు అందుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం తర్వాత రిషబ్ శెట్టి ప్లానింగ్ కూడా మామూలు రేంజ్ లో లేదు. ‘జై హనుమాన్'(Jai Hanuman) చిత్రం లో హనుమంతుడి క్యారక్టర్ చేయబోతున్నాడు. అదే విధంగా బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించబోతున్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ క్యారక్టర్ లో కూడా ఆయన కనిపించబోతున్నాడు. ఈ రెండు క్యారెక్టర్స్ చేయాలనీ ప్రతీ స్టార్ హీరోకి డ్రీం ఉంటుంది. కానీ రిషబ్ శెట్టి ఏకకాలం లో ఈ రెండు క్యారెక్టర్స్ చేయబోతున్నాడంటే ఆయన అదృష్టం ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి.