Rishab Shetty NTR Relationship: ‘కాంతార’ సినిమాతో ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు రిషబ్ శెట్టి…అత్యుత్తమమైన నటన ప్రతిభ కలిగి ఉన్న వాళ్లు తమ టాలెంట్ చూపించుకోవడానికి ఒక్క సినిమా పడితే చాలు అని అందరు కోరుకుంటారు. అలాంటి సినిమా రిషబ్ శెట్టి కి పడింది. మొత్తానికైతే కాంతార తో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను థియేటర్లకి రప్పిస్తున్నాడు… అలాంటి హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ కి రిషబ్ శెట్టి కి మధ్య సంబంధం ఏంటి? వీళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ కుదరడానికి కారణం ఏంటి? కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడానికి గల కారణం ఏంటి? అంటే…
జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ శాలిని ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన హోటల్ పనులను చూసుకుంటూ ఉండేది. ఆ హోటల్ కి తన వల్ల చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆ హోటల్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ హరికృష్ణ చూసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే శాలిని కి హరికృష్ణకు మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి పెళ్లి కాకుండానే ఎన్టీఆర్ కి జన్మనిచ్చారు…ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని తన వాళ్లే అని భావించిన కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కూడా వీళ్లను ఆదరించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మారి స్టార్ హీరోగా రాణిస్తున్నప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం వాళ్ళని అక్కున చేర్చుకున్నారు… నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వాళ అమ్మ శాలిని గారిది కర్ణాటకలోని కుందాపూర్ ఊరు కావడం విశేషం…
ఇక రిషబ్ శెట్టి పుట్టి పెరిగింది కుందాపూర్ లోనే కావడం విశేషం…జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మది రిషబ్ శెట్టిది ఒకే ఊరు అవ్వడం వల్ల ఎన్టీఆర్ రిషబ్ తో ఎక్కువ సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు… ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే కుదిరింది. ఇక షాలిని కి రిషబ్ శెట్టి వాళ్ల అమ్మ నాన్న పిన్ని బాబాయ్ లు అవుతారట. షాలిని కి రిషబ్ తమ్ముడవుతాడు. ఇక ఎన్టీఆర్ కి మాత్రం మామ అవుతాడు… ఇక ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఒకరి సినిమాలో ఒకరు నటించేంత ఫ్రెండ్షిప్ ను కలిగి ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు…
ఇక రిషబ్ శెట్టి స్టార్ హీరో అయినప్పటికి పాన్ ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరితో పోటీ పడుతున్నప్పటికి, ఆయన బెంగుళూరు నగరంలో కాకుండా కుందాపూర్ అనే ఒక ఊరు లో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడ ఎటు చూసినా చెట్లు, చేమలు, ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. ఇల్లుకి ఆవరణలోనే సముద్రం ఉండటం… ఇవన్నీ చూసిన తనకి పుట్టి పెరిగిన ఊరును వదిలేసి వెళ్తే కన్నతల్లిని వదిలేసి వెళ్లినట్టే అని రిషబ్ శెట్టి భావిస్తున్నాడు. కాబట్టి అతను తన ఊర్లోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇక అక్కడ లొకేషన్స్ సైతం చాలా పీస్ ఫుల్ గా ఉంటాయి. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే తను ఇప్పటికీ అక్కడే ఉంటూ ఉండడం విశేషం…
ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన తనని కలవాలంటే మాత్రం కుందాపూర్ వెళ్లాల్సిందే… ఇక రిషబ్ భార్య అయిన ప్రగతి సైతం రిషబ్ శెట్టి చేసిన ఒక సినిమా సూపర్ సక్సెస్ అయినప్పుడు రిషబ్ శెట్టి అభిమానులతో మాట్లాడడానికి వచ్చాడు. అప్పుడు ప్రగతి రిషబ్ పక్కనే ఉన్న రక్షిత్ శెట్టి ద్వారా ఈ మూవీ దర్శకుడు రిషబ్ శెట్టి అని తెలుసుకొని అతనితో మాట్లాడింది. వాళ్ళిద్దరిది ఒకే ఊరు అని తెలిసిన తర్వాత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిగురించింది. వీళ్ళ పెళ్లి కి రిషబ్ ఇంట్లో ఒకే కానీ ప్రగతి ఇంట్లో ఒప్పుకోలేదు. మొత్తానికి ఎలాగో అలాగా పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక తను కూడా కుందాపూర్ లో ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్లిద్దరి అభిరుచి మేరకు వాళ్ళ నివాసాన్ని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు…