Kantara Collections: ఇటీవల కాలం లో కర్ణాటక సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు రేపిన చిత్రం కాంతారా..రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ చిత్రం అక్కడ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి KGF సిరీస్ రికార్డ్స్ నే బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తుంది..కేవలం కర్ణాటక ప్రాంతం నుండే ఈ సినిమా 15 రోజులకు గాను 92 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది..ఒక్క KGF చాప్టర్ 2 మినహా కర్ణాటక లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన సినిమానే లేదు.

అంతే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ కూడా కన్నడ చలన చిత్ర పరిశ్రమ కి చాలా చిన్నది అని చెప్పొచ్చు..కానీ కాంతారా వసూళ్లు అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతుంది..ఇప్పటి వరుకు ఈ సినిమా ఇక్కడ 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది..మొత్తం మీద ఈ చిత్రం 15 రోజులకు గాను 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈరోజు తెలుగు ,హిందీ మరియు తమిళం బాషలలో విడుదల చేసారు.
తెలుగు లో ఈ సినిమా హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి..సోషల్ మీడియా నుండి అద్భుతమైన టాక్ రావడం తో మొదటి రోజు ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ముఖ్యంగా సిటీస్ మరియు టౌన్స్ లో అయితే ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పడుతున్నాయి..తెలుగు వారెవ్వరికి ఈ సినిమాలోని హీరో హీరోయిన్ ఎవరో కూడా తెలీదు..అయినా కానీ ఇంత మంచి ఓపెనింగ్ ఇస్తున్నారంటే తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు.

అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోటి రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..అదే కనుక జరిగితే ఈ సినిమాకి పెట్టిన డబ్బులతో 50 శాతం కి పైగా మొదటి రోజే రికవరీ చేసినట్టు అన్నమాట..ఇదే ట్రెండ్ ని ఫుల్ రన్ లో కూడా కొనసాగిస్తే ఈ సినిమా కచ్చితంగా 10 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..చూడాలి మరి కర్ణాటక ప్రాంతం లో ఆ స్థాయి ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇక్కడ కూడా అదే రేంజ్ లో ఆడుతుందా లేదా అనేది.