12 గంటల్లో 1.68 లక్షల మంది.. ఇదీ ఆర్జీవీ క్రేజ్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మ్యాజిక్‌ మామూలుగా ఉండదు. రిజల్ట్ ఎలా ఉన్నా.. తన సినిమా, వెబ్‌ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్, ఓపెనింగ్స్ రాబట్టడంలో ఆర్జీవీ స్టయిలే లేరు. పైసా ఖర్చు చేయకుండా మూవీని ప్రమోట్ చేయడంలో పీహెచ్‌డీ చేసేశాడు. అలా, తాజా మూవీ ‘క్లైమాక్స్‌’కు సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని భారీ హైప్ క్రియేట్‌ చేశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన మూవీతో లాక్‌డౌన్‌లో ఆర్జీవీ చిన్నపాటి అలజడే సృష్టించాడు. ఎడారిలో మియా అందాలను తనదైన […]

Written By: admin, Updated On : June 7, 2020 2:54 pm
Follow us on


సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మ్యాజిక్‌ మామూలుగా ఉండదు. రిజల్ట్ ఎలా ఉన్నా.. తన సినిమా, వెబ్‌ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్, ఓపెనింగ్స్ రాబట్టడంలో ఆర్జీవీ స్టయిలే లేరు. పైసా ఖర్చు చేయకుండా మూవీని ప్రమోట్ చేయడంలో పీహెచ్‌డీ చేసేశాడు. అలా, తాజా మూవీ ‘క్లైమాక్స్‌’కు సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని భారీ హైప్ క్రియేట్‌ చేశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన మూవీతో లాక్‌డౌన్‌లో ఆర్జీవీ చిన్నపాటి అలజడే సృష్టించాడు. ఎడారిలో మియా అందాలను తనదైన స్టయిల్లో చిత్రీకరించిన ఆర్జీవీ.. సాంగ్, టీజర్, ట్రైలర్ల ద్వారా కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచాడు.

ముందుగా చెప్పినట్టుగానే జూన్ 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై విడుదల చేశాడు. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ బుకింగ్స్ చేసుకున్నారు. ఆర్జీవీ టేకింగ్‌ను, మియా అందాలు చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. 12 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 68 వేల 596 మంది ‘క్లైమాక్స్‌’ను వీక్షించినట్టు ఆర్జీవీ ట్వీట్ చేశాడు. స్టార్టింగ్‌లో మాగ్జిమమ్ 50 వేల మంది ఈ మూవీ చూస్తారని అంచనా వేశామని చెప్పాడు. కానీ, ఏకంగా 2.75 లక్షల మంది రావడంతో సర్వర్ క్లాష్ అయిందని తెలిపాడు. అందుకు సంబంధించిన సర్వర్ గ్రాఫ్ లను ఆర్జీవీ ట్విట్టర్లో షేర్ చేశారు.