బయటికెళ్తే ఒళ్ళంతా పచ్చడే అంటున్న వర్మ

కరోనాపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్శ తనదైన శైలిలో స్పందించారు. రాంగోపాల్ వర్శ సెటైరికల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ పై స్పందిస్తూ ‘ఇంట్లో ఉంటే ఉగాది పచ్చడి.. బయటికెళితే ఒళ్ళంతా పచ్చడి’ అంటూ ట్వీట్ చేశారు. ఇది పోలీసులనుద్దేశించా? లేక ప్రజలనుద్దేశించి అన్నాడా అనేది అర్థంకానప్పటికీ ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాంగోపాల్ వర్మ గతంలో హీరోలు, నాయకులపై సెటైర్లు వేసేవాడు. కొద్దిరోజులుగా కరోనా […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 12:09 am
Follow us on

కరోనాపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్శ తనదైన శైలిలో స్పందించారు. రాంగోపాల్ వర్శ సెటైరికల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ పై స్పందిస్తూ ‘ఇంట్లో ఉంటే ఉగాది పచ్చడి.. బయటికెళితే ఒళ్ళంతా పచ్చడి’ అంటూ ట్వీట్ చేశారు. ఇది పోలీసులనుద్దేశించా? లేక ప్రజలనుద్దేశించి అన్నాడా అనేది అర్థంకానప్పటికీ ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రాంగోపాల్ వర్మ గతంలో హీరోలు, నాయకులపై సెటైర్లు వేసేవాడు. కొద్దిరోజులుగా కరోనా వైరస్ పై తనదైన శైలిలో వర్మ స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఏపీ పోలీసులు కరోనాను అరికట్టడానికి జాగ్రత్తలు చెబుతూ ఒక వీడియో చేయగా దానిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇలాంటి సీరియస్ టైంలో సంపూర్ణేష్ బాబుల చేయకండి’ అంటూ ట్వీట్ చేశాడు. మరోసారి కరోనాపై స్పందిస్తూ ‘ఇంట్లో ఉంటె ఉగాది పచ్చడి.. బయటికెళితే ఒళ్ళంతా పచ్చడి. అని పోలీసులను హెచ్చరిస్తున్నారని ట్వీట్ చేశారు. సెలబెట్రీలంతా కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ట్వీట్ చేస్తుంటే వర్శ మాత్రం కరోనాపై జోకులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు.