https://oktelugu.com/

Rgv: ప్రముఖ పొలిటీషియన్ పై … ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేసిన ఆర్జీవి

Rgv: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమ కాకుండా రాజకీయం పరంగా కూడా తన ట్వీట్ తో విమర్శించ గలిగే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే పొలిటికల్ బయోపిక్ తీయడంలో తనకు ఎవరూ సాటిరారు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద వర్మ తీసిన రక్తచరిత్ర, లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, సినిమాలు ఎన్ని సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆర్జివి దృష్టి తెలంగాణ పై పడింది అనే చెప్పవచ్చు. కొండా మురళి మరియు కొండా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 20, 2021 / 12:42 PM IST
    Follow us on

    Rgv: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమ కాకుండా రాజకీయం పరంగా కూడా తన ట్వీట్ తో విమర్శించ గలిగే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే పొలిటికల్ బయోపిక్ తీయడంలో తనకు ఎవరూ సాటిరారు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద వర్మ తీసిన రక్తచరిత్ర, లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, సినిమాలు ఎన్ని సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే.

    ప్రస్తుతం ఆర్జివి దృష్టి తెలంగాణ పై పడింది అనే చెప్పవచ్చు. కొండా మురళి మరియు కొండా సురేఖల నేపథ్యంలో “కొండా” అనే టైటిల్ తో బయోపిక్ తీయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కొరకు వరంగల్ లో బృందం పర్యటించింది. దీనికి సంబంధించి వర్మ ఒక సంచలన ట్వీట్ చేశారు.

    “అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ” అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు వర్మ.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఈ ట్వీట్ చక్కర్లు కొడుతుంది. నల్లబల్లి సుధాకర్… ఎవరు అనే ప్రశ్న అందర్నీ గజిబిజి చేస్తోంది. వర్మ ట్వీట్ పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ కు సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు కు,  నల్లబెల్లి సుధాకర్ పేరుతో వర్మ సెటైర్ వేసినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి ఈ సినిమా తీయడం పై రాంగోపాల్ వర్మ కు బెదిరింపులు వచ్చి ఉంటాయని అనిపిస్తుంది.  ఈ సందర్భంగా ఆర్జీవి ట్వీట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.