https://oktelugu.com/

Kondapolam: కొండపొలం హక్కులను దక్కించుకున్న అమెజాన్​!

Kondapolam: వైష్ణవ్​ తేజ్​ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం కొండపొలం. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫస్ట్​ఫేమ్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్​ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్​ మాధ్యమమైన అమెజాన్​ ప్రైమ్​ సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అమెజాన్​లో స్ట్రీమ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 20, 2021 / 12:28 PM IST
    Follow us on

    Kondapolam: వైష్ణవ్​ తేజ్​ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం కొండపొలం. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫస్ట్​ఫేమ్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్​ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్​ మాధ్యమమైన అమెజాన్​ ప్రైమ్​ సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అమెజాన్​లో స్ట్రీమ్​ కానున్నట్లు సమాచారం. రకుల్​ ప్రీత్​సింగ్​ ఈ సినమాలో హీరోయిన్​, సాయి చంద్​, కోటా శ్రీనివాస రావు, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎమ్​ఎమ్​ కీరవాణి సంగీతం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

     

    మొదట ఈ నవలను సుకుమార్​, హరీశ్​ శంకర్​, కొరటాల శివ  లాంటి దర్శకులు ఈ సినిమాగా తీయాలని అనుకున్నారట. అయితే, చివరకు తనకు ఆ అవకాశం దక్కిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్రిష్​ తెలిపారు. ఈ కథకు అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని అనిపించి నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలవగా.. ఆయన రాసిన చినుకుల సవ్వడి లోని ప్రేమకథను సూచించినట్లు తెలిపారు. ఆ ప్రేమ కథనే కొండపొలం సినిమా కోసం ఉపయోగించినట్లు క్రిష్​ వివరించారు.  ఈ సినిమా షూటింగ్​ను తొలుత గోవా, నల్లమల అడవుల్లో అనుకున్నారు. కానీ, కొన్ని పరిస్థితుల కారణంగా వికారాబాద్​ ఫారెస్ట్​లో తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు.  ఈ సినిమా తమ జీవితాల్లో అందమైన అనుభూతిగా ఉండిపోతుందని క్రిష్ అన్నారు.  అయితే,   థియేటర్ల లో ఈ సినిమాను చూడలేకపోయిన వారంతా.. ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం దొరికినట్లే.