RGV- Prabhas Fans: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 43వ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం వరల్డ్ వైడ్ గా ఘనంగా నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచాలు కాలుస్తూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బిల్లా’ సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్లో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. అయితే ఈ సంబరాల్లో ఓ చోట అపశృతి చోటు చేసుకుంది. వేడుక మాటున థియేటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడున్న సీట్లన్నీ కాలిపోయారు. ఆ తరువాత యాజమాన్యం వెంటనే అప్రమత్తమై మంటలను చల్లార్చింది. ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవి వెంటనే స్పందించారు. అభిమానులపై ఆయన స్టైల్లో కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఆర్జీవి చేసిన కామెంట్ పై ప్రభాస్ అభిమానుల కూడా వెరైటీగా రెస్పాండ్ అయ్యారు.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరిగే ప్రతి ఇష్యూపై ఆయన కామెంట్ కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఏమాత్రం లేట్ చేయకుండా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన కామెంట్ చేశాడు. ప్రభాస్ 43వ బర్త్ డే సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ‘బిల్లా’ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్లోనే బాణసంచా కాల్చారు.

అయితే ఆ మంటలు సీట్లకు అంటుకోవడంతో అవి చెలరేగాయి. దీంతో అటు థియేటర్ యాజమాన్యం, ఇటు ఫ్యాన్స్ అలర్ట్ అయి మంటలను ఆర్పేశారు. ఆ తరువాత ఈ విషయం బయటకు రావడంతో రకరకాల కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇది దీపావళి వేడుక కాదు.. సినిమా నడుస్తుండగా థియేటర్ ను తగలబెట్టి సంబరాలు చేసుకోవడం ప్రభాస్ అభిమానులది పిచ్చి చర్య.. ’ అని పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు కూడా స్పందించారు. ‘ఇది ప్రభాస్ స్టయిల్ ఆఫ్ దీపావళి సెలబ్రేషన్స్’ అంటూ వర్మకు కౌంటర్ పోస్టు పెట్టారు. అయితే వీటిపై మిశ్రమ కామెంట్లు వస్తున్నాయి.