RGV Saraswati Love Story: శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…కెరియర్ మొదట్లో చేసిన సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్న విధానం అయితే బాగుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ షో కి సందీప్ రెడ్డి వంగ రాంగోపాల్ వర్మ ఇద్దరూ గెస్ట్ లుగా వచ్చారు. ఇక అందులో జగపతి బాబు రామ్ గోపాల్ వర్మ ని ఉద్దేశిస్తూ సరస్వతి గురించి మాట్లాడాడు. సరస్వతి అనే ఆవిడ రామ్ గోపాల్ వర్మ వాళ్ళ టీచర్ అని తను మొట్టమొదటిగా లవ్ చేసింది తననే అంటూ వర్మ చెప్పడం విశేషం… ఇక ఆ విషయాన్ని తను అప్పుడు చెప్పలేదని మొన్నీ మధ్య ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకొని కాల్ చేసి అప్పట్లో నేను మిమ్మల్ని లవ్ చేశానని చెప్పారట. అప్పటికే ఆమెకు 80 సంవత్సరాలు ఉండడం విశేషం…
మరి మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ తన స్కూల్ టైం లో ఉన్నప్పుడు సరస్వతి అనే మేడం తన ఫస్ట్ లవ్ గా పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చాడు. కానీ తనకు రీసెంట్ టైమ్స్ లో ప్రపోజ్ చేశాను అనే విషయాన్ని కూడా ఈ షో ద్వారా అభిమానులకు తెలియజేయడం విశేషం…
మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడిన కూడా ఆడవాళ్లు అంటే తనకు ఇష్టమని కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టమైతే లేదని చెబుతూ ఉంటాడు. మొత్తానికైతే ఇప్పుడు సోలోగానే తన లైఫ్ ను లీడ్ చేస్తు ముందుకు సాగుతున్నాడు. ఇక ఏదేమైనా కూడా రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
శివ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తూ అక్కడ సినిమాలు చేసి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు…ఇక అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరోతో సర్కార్ లాంటి సినిమా చేసి అతనికి ఎవరి గ్రీన్ సక్సెస్ ని అందించి పెట్టాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పటికీ చాలామందికి అభిమానం అయితే ఉంటుంది…