Homeఎంటర్టైన్మెంట్అమృత కామెంట్స్ పై ఆర్జీవీ స్పందన..

అమృత కామెంట్స్ పై ఆర్జీవీ స్పందన..


ఫాదర్స్ డే సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే టైటిల్ ఓ మూవీని అనౌన్స్‌ చేశారు. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ ‌లైన్‌, నిజ జీవిత కథ అని చెబుతూ ఓ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. పోస్టర్ విడుదల చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ‘ప్రణయ్‌’ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. అనంతరం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత పేరుతో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు ట్రెండ్‌ అవుతున్నాయి. దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశాడు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

‘మర్డర్ చిత్రం మూడు నైతిక సందిగ్ధతల మధ్య నడుస్తుంది. 1. తండ్రి తన బిడ్డపై నియంత్రణను పరిమితం చేయడం 2. ఒక కుమార్తె తనకు ఏది మంచిదో తెలియకపోయినా దాన్ని విస్మరించాలా? 3. వేరొకరి జీవితాన్ని మెరుగుపర్చడానికి ఒకరి జీవితాన్ని బలి తీసుకోవడాన్ని సమర్థించవచ్చా? అనే అంశాలపై ఉంటుంది. ఈ మూవీ గురించి అమృత చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. తాను, తన తండ్రి కథతో నేను సినిమా తీస్తున్నానని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఇది అమృతే రాసిందనుకున్నా లేదా ఓ పనిలేని వాడు రాసినా, నేను ఈ మూవీలో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసర ఆందోళనలతో ఉన్న వారి పట్ల స్పందించడం, వారి అనుమానాలను నివృత్తి చేయడం నా బాధ్యత అని భావిస్తున్నా.

మొట్ట మొదటగా.. మర్డర్ అనేది ఒక నిజమైన కథపై ఆధారపడినదని పోస్టర్ పైనేస్పష్టం చేశా. అంతేకాని ఇదే నిజమైన కథ అని నేను చెప్పుకోలేదు. అలాగే, నా చిత్రానికి సంంధించిన న్యూస్‌ కొన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంది. ఇందులో ఇన్వాల్వ్‌ అయిన వాళ్లు దాన్ని అంగీకరించారు కూడా. ‘మర్డర్’కు సంబంధించిన నా పాయింట్‌ను వివరించడానికి నేను ఉపయోగించిన నిజమైన ఫోటోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అవి నాకు ఒకరు ఇచ్చినవు కావు, అందులో రహస్యం ఏమీ లేదు కాబట్టి ఒకరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

‘మర్డర్’కు సంబంధించి ఏది నిజమైన కథ అనేదానిపై అనేక అభిప్రాయాలు, భిన్న కోణాలు ఉన్నాయి. నా కోణం ఏంటో ఈ మూవీ రిలీజ్‌ అయిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ముందుగానే కథనాన్ని ఊహించుకోవడం తొందరపాటు, అవివేకం అవుతుంది. కాబట్టి ఓ జర్నలిస్ట్ వార్త రాసినా, ఓ విచారణ అధికారి నివేదించినా, ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా, అది వారివారి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్ గా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది. నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. అలాగే, ఈ వాస్తవ కథలో పాలుపంచుకున్న చెడ్డ వ్యక్తులను నేను హైలైట్‌ చేస్తానని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ చెడ్డవారు కాదు. కొన్ని చెడు పరిస్థితులు, వ్యక్తులు మాత్రమే వారిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను బలంగా నమ్ముంతా. ‘మర్డర్’లో నేను అన్వేషించబోయేది అదే. కాబట్టి సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు అమృతవే అయినా.. మరెవరు రాసినా, నా ఫైనల్ మెసేజ్ ఇదే. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి ఉన్నాయి. ఆ బాధను ‘మర్డర్’లో గౌరవిచడంలో నా చిత్తశుద్ధిని మీరు చూస్తారు’ అని ఆర్జీవీ స్పష్టం చేశారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular