RGV Comments On Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ… ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడు అయిన మనోజ్ బాజ్ పాయ్ ని మెయిన్ లీడ్ లో పెట్టి ‘పోలీస్ స్టేషన్ మే బూత్’ అనే సినిమాని చిత్రీకరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. రమ్యకృష్ణ కూడా ఇందులో ఒక క్యారెక్టర్లు నటిస్తోంది. ఆమెకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఆమె ఇందులో ఎలాంటి పాత్రను పోషిస్తోంది అనేదాని మీద క్లారిటీ ఇవ్వకపోయిన కూడా ఆమె లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది… ఇక ప్రస్తుతం నవంబర్ 14వ తేదీన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమా రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో మొదట రఘువరన్ పక్కన ఉండే క్యారెక్టర్ లో మోహన్ బాబు ని తీసుకుందామని అక్కినేని వెంకట్ చెప్పారట. దానికి రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబు అయితే ఆ క్యారెక్టర్ లో డెప్త్ రాదని చెప్పాడట. కారణం ఏంటంటే మోహన్ బాబు ను మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూశాం… కాబట్టి రఘువరన్ ని హీరో కొడుతుంటే తన నుంచి వచ్చే రియాక్షన్స్ కి ప్రేక్షకులు పెద్దగా ఇంప్రెస్ అవ్వరని చెప్పి ఆ ప్లేస్లో కొత్త నటుడుని పెడితేనే ఆ సీన్ పండుతుందని చెప్పాడట.
దాంతో మోహన్ బాబుని పక్కనపెట్టి వేరొక నటుడితో ఆ క్యారెక్టర్ ని చేయించారట…అదే సమయంలో ఆ క్యారెక్టర్ ని కనక మోహన్ బాబు చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆర్జీవీ చెప్పిన మాటలను మొదట అక్కినేని వెంకట్ వినకపోయిన కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్మ చెప్పిందే కరెక్ట్ అయింది అంటూ ఆయన వర్మ ని మెచ్చుకున్నారట.
మొత్తానికైతే శివ సినిమా అప్పట్లో ఒక పాత్ బ్రేకింగ్ సినిమాగా మారిపోయిందనే చెప్పాలి. ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయినప్పటికి శివ సినిమాకి ఉన్న ఇమేజ్ ను కానీ, ఆ మూవీ కి ఉన్న టెక్నికల్ వర్క్ ను కానీ, ఆ ఫిలిం సాధించిన రికార్డులను కానీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోవడం విశేషం…