The Raja Saab Movie Release Date: అనేక వాయిదాల తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ట్రైలర్ ని నాలుగు నెలల ముందే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ నుండే కాకుండా, ఆడియన్స్ నుండి కూడా ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ ని చాలా కాలం తర్వాత చూసినందుకు అందరూ థ్రిల్ ఫీల్ అయ్యారు. టీవీలలో, మొబైల్స్ లో చూడడం కంటే థియేటర్స్ లో చూసినప్పుడు అద్భుతమైన అనుభూతి కలిగిందని కూడా ఈ ట్రైలర్ కి రివ్యూస్ ఇచ్చారు. అయితే గత రెండు రోజుల నుండి ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి వాయిదా పడిందా? అని నిరాశకు గురయ్యారు.
ట్విట్టర్ లో మూవీ టీం ని ట్యాగ్ చేసి పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. విషయం ప్రొడక్షన్ టీం వరకు చేరడం తో వెంటనే ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చారు. ‘సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా మా సినిమాపై జరుగుతున్న అసత్య ప్రచారాలు మా దృష్టికి వచ్చాయి. మా సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే రాజా సాబ్ చిత్రాన్ని జనవరి 9 న విడుదల కాబోతుంది. ఆ సమయానికి తీసుకొచ్చేందుకు మా టీం రేయింబవళ్లు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. థియేటర్స్ లో మీ అందరికీ కచ్చితంగా ఈ సినిమా ద్వారా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకండి. సంక్రాంతికి ఈ మ్యాగ్నమ్ ఓపస్ ని గ్రాండ్ గా థియేటర్స్ లో సెలెబ్రేట్ చేసుకునేందుకు సిద్ధం అవ్వండి’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని పాటల విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక చిత్రం ప్రేక్షకుల్లో బలంగా వెళ్లాలంటే ముందు పాటలు పెద్ద హిట్ అవ్వాలి. పాటలు సూపర్ హిట్ అయితే ఇన్ స్టాగ్రామ్ తో పాటు అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో లక్షలాది మందికి సినిమా రీచ్ అవుతుంది. ఈమధ్య విడుదలయ్యే ప్రతీ సినిమాకు మినిమం గ్యారంటీ ఓపెనింగ్ వసూళ్లు వస్తున్నాయంటే అందుకు ముఖ్య కారణం పాటలు విడుదల అవ్వడం వల్లే. దీపావళి కి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని వదులుతారేమో అని అనుకున్నారు కానీ, అప్పటికి థమన్ ‘అఖండ 2’ మూవీ రీ రికార్డింగ్ వర్క్ లో బిజీ గా ఉండడం తో మొదటి పాటని విడుదల చేయలేకపోయారు. ఈ నెలలో కచ్చితంగా మొదటి పాటని విడుదల చేస్తారనే సమాచారం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
An Official Note from Team #TheRajaSaab confirming their January Release plans! pic.twitter.com/8vyAfWn7D8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) November 4, 2025