RGV Comments About Nagarjuna: శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఆయన చేసిన ఈ సినిమా వల్ల సినిమా మేకింగ్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఒక మూస ధోరణిలో సాగుతున్న తెలుగు ఇండస్ట్రీ కి కొత్త రంగులు అద్దిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక ప్రేక్షకులు సైతం ఈ సినిమాలోని కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడంతో ప్రతి ఒక్కరు శివ టైప్ ఆఫ్ మేకింగ్ తోనే సినిమాలను చేస్తూ వచ్చారు. మొత్తానికైతే శివ తరహా సినిమాలతో కొంతమంది భారీ విజయాలను సాధిస్తే మరికొంత మంది ప్లాప్ లను మూటగట్టుకున్నారు. ఇక శివ సినిమా వాటన్నింటికి ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. అప్పటినుంచి ఇప్పటివరకు శివ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాని 4కె లో రిలీజ్ చేస్తున్న క్రమంలో ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రామ్ గోపాల్ వర్మ, నాగార్జున, సందీప్ రెడ్డి వంగ తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వర్మ కొన్ని గొప్ప విషయాలు చెప్పాడు. నాగార్జున ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా హెల్ప్ చేశాడట. అప్పట్లో ఇళయరాజా గారి కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చెన్నైలో స్ట్రైక్ నడుస్తుందట…ఇక ఇదే సమయంలో కొన్ని రోజులు వెయిట్ చేద్దామని వర్మ చెప్పినప్పటికి నాగార్జున వాళ్ళ బావ అయిన సురేంద్ర ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కావడంతో తను మాత్రం తొందరగా సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టాడట…
Also Read: శివ సినిమా ఫైట్ కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ ని తీసేసిన వర్మ… ఇంట్రెస్టింగ్ స్టోరీ…
లేకపోతే మనకు నష్టాలు మిగిలిచే అవకాశం ఉంది. కాబట్టి తొందర రిలీజ్ చేస్తే వాటిని తప్పించుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయన చెప్పాడట. కానీ ఆర్ఆర్ లేకుండా ఎలా అంటే అప్పుడు సురేంద్ర ఉండి మన బ్యానర్ లో వచ్చిన పాత సినిమాల్లోని ట్రాక్ సౌండ్లను తీసి దీనికి ఆడ్ చేయండి అని చెప్పారట. కానీ వర్మ మాత్రం దానికి ఒప్పుకోకపోవడంతో నాగార్జున ఇన్వాల్వ్ అయి రాము చెప్పినట్టు చేయండి.
కావాలంటే నా రెమ్యూనరేషన్ మొత్తం కట్ చేసుకున్న పర్లేదు. కానీ ఈ సినిమా మొత్తం రాము కి నచ్చినట్టుగా చేయండి అని చెప్పారట. దాంతో ఆర్జీవికి ఫుల్ రైట్స్ రావడం చెన్నై వెళ్లి రీ రికార్డింగ్ చేయించుకొని వచ్చి సినిమాని రిలీజ్ చేశాడు.
మొత్తానికైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉండడం సౌండ్స్ చాలా స్పెషల్ గా ఉండడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ రోజు కనుక నాగార్జున తనకు సపోర్టుగా ఉండకపోతే మాత్రం ఏవో ట్రాక్ సౌండ్స్ ని ఆడ్ చేసి సినిమాని రిలీజ్ చేసే వారని సినిమా అంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదని వర్మ మరోసారి నాగార్జున గొప్పతనం గురించి తెలియజేయడం విశేషం…