Pawan Kalyan New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ‘పవన్ కళ్యాణ్’ కి ఉన్న క్రేజ్ అండ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన క్రేజ్ ను టచ్ చేసే హీరోలు ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేరు… ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని సైతం బీట్ చేసే కెపాసిటీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది అనేంతలా ఆయన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఈ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన హరిహర వీరమల్లు సినిమాతో ప్లాప్ ను మూట గట్టుకుంటే ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. మొత్తానికైతే ఈ రెండు సినిమాలు అతని కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన నుంచి మంచి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లోనే చాలా బిజీగా కొనసాగుతున్నాడు. మరి తొందరలోనే మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: శివ సినిమా ఫైట్ కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ ని తీసేసిన వర్మ… ఇంట్రెస్టింగ్ స్టోరీ…
ఇక ఇప్పటికే ఇద్దరు స్టార్ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ కోసం కథలను రెడీ చేసుకొని ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో అనిల్ రావిపూడి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ఒక కథను వినిపించారట. ఆ కథ పవన్ కళ్యాణ్ కి నచ్చినప్పటికి దానికోసం డేట్స్ ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉందని దానిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
గత రెండు సంవత్సరాల నుంచి సురేందర్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ కి కథల మీద కథలు చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఒకానొక దశలో వీళ్ల కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ కూడా వస్తోంది అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఏజెంట్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి మరొక సినిమా చేయలేదు.
మరి పవన్ కళ్యాణ్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ ఇద్దరి దర్శకులలో ఆయన ఎవరికి అవకాశాన్ని ఇస్తాడు. ఎవరి సినిమా ముందు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…