RGV and Puri Jagannadh
RGV-Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు ఒక మూస ధోరణి లో సాగుతున్న సినిమాని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు. ఇక ఒకప్పుడు ఈయన చేసిన సినిమా కోసం జనాలు విపరీతంగా ఎదురుచూసే వాళ్లు.. ఇక 1990 వ సంవత్సరంలో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు.
ఇక ఆ తర్వాత కూడా ఆయన చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ లో బిగ్ బి అమితాబచ్చన్ కి సర్కార్, కంపెనీ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందించాడు. ఇలాంటి రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యుడుగా పనిచేసిన పూరి జగన్నాథ్ కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు చేసే డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాల్లో శివ, సర్కార్, కంపెనీ, సత్య ఈ సినిమాలంటే పూరి జగన్నాధ్ కి చాలా ఇష్టమట.
ఇక వీటిలో రామ్ గోపాల్ వర్మ పూర్తి ఎఫర్ట్ మనకు కనబడుతుంది. ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమాలు కాబట్టి ఆ సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయని ఒకానొక సందర్భంలో పూరి తెలియజేశాడు. ఇక వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు కూడా కరెక్ట్ గా ఫోకస్ చేసి సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ కొట్టేంత కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన సినిమా మీద ఫోకస్ చేయకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే సెటైరికల్ సినిమాలను ఎక్కువగా చేస్తూ కాంట్రవర్సీలో నిలుస్తున్నాడు.
ఇక ఇలాంటి సమయంలోనే ఆయన చేయాలనుకున్న స్టోరీ ని ఎవరికి భయపడకుండా దాంట్లోని నిజాలు తెలుసుకుని ఆ సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఎది ఏమైనా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ఒక సంచలనాన్ని సృష్టించాడనే చెప్పాలి.