దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. కరోనా నివారణకు కేంద్రం ఇప్పటికే లాక్డౌన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లు, సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ స్టార్లు ఇంటికే పరిమితమయ్యారు. పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్లు కరోనాపై ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తాజాగా ‘స్టూడెంట్ నెంబర్ 1’ మూవీలోని ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి’ సాంగ్ తరహాలోనే ‘కరోనా సాంగ్’ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోకు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా కరోనాపై రాంగోపాల్ వర్శ కరోనా పాటకు సంబంధించి ఓ ప్రొమో రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ సాయంత్రం 5.30కు విడుదల చేయనునున్నట్లు ఆర్జీవీ ట్వీటర్లో ప్రకటించాడు. కనిపించని పురుగు’ పేరుతో ఆర్జీవీ ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ట్వీటర్లో విడుదల చేశారు. చేతులు కడుక్కుని మరీ ఈ పాట వినాలని.. చెవులకి మాస్క్ తొడుక్కొని వినాలని వర్మ నెటిజన్లను కోరాడు.
ఈ ప్రోమో విన్న నెటిజన్లు మాత్రం ఆర్జీవీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సాంగ్ విన్నవారు తమ చెవులను శానిటైజర్లతో కడుక్కోవాలని ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటలో ఆర్జీవీ వాయిస్ విన్న చెవులు.. తట్టుకోవడం కష్టమని వ్యగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఈ పాట వింటే కరోనా వైరస్ సైతం సూసైడ్ చేసుకుంటుందని కామెంట్ చేసారు. దర్శకుడు ఆర్జీవీ ఈ పాటను స్వయంగా రాసి పాడారు. ప్రొమోతోనే హల్చల్ చేస్తున్న ఆర్జీవీ పూర్తి వీడియో విడుదల చేశాకే నెటిజన్లు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
