RGV comments on Toxic: ఎంతో కాలం నుండి షూటింగ్ సెట్స్ మీద ఉన్నటువంటి ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు విడుదలై సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. మరికొద్ది గంటల్లో దేశవ్యాప్తంగా ‘ది రాజా సాబ్’ మూవీ విడుదల కాబోతుంది. ఇలాంటి సమయం లో ఆ సినిమా గురించి చర్చ కంటే, ‘టాక్సిక్’ టీజర్ గురించే ఎక్కువ చరించుకుంటున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ టీజర్ ఎలాంటి ప్రకంపనలు పుట్టించిందో. ఈ టీజర్ లోని కొన్ని షాట్స్ ని చూస్తే ఆశ్చర్యం వేయక తప్పదు, ఆ షాట్స్ ని తెరకెక్కించింది ఒక అందమైన అమ్మాయి అనే విషయం తెలిశాక. అవును, ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) అనే అమ్మాయి. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందం తో కనిపించే ఈమెలో, ఇంతటి వైల్డ్ ఆలోచనలు ఉన్నాయా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
ఈ టీజర్ లో హీరో పాటు వచ్చిన అసిస్టెంట్, క్రిందకు దిగి బాంబు ని ఫిక్స్ చేస్తాడు. ఆ బాంబు ట్రిగ్గర్ ని కారు డిక్కీ రాడ్ కి తగిలిస్తాడు. హీరో కారు లోపల హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అతని రొమాన్స్ దాటికి కారు ఊగిపోతూ ఉంటుంది, ఆ క్రమం లోనే డిక్కీ రాడ్ కి తగిలించిన ట్రిగర్ క్లిక్ అయ్యి బాంబు పేలుతుంది , విలన్స్ అందరూ చనిపోతారు. ఇంతటి వైల్డ్ షాట్స్ ఆ టీజర్ లో చాలానే ఉన్నాయి. అవన్నీ తెరకెక్కించింది ఈ అమ్మాయే. ఈ టీజర్ ని చూసిన తర్వాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) మనలాగే ఆశ్చర్యపోతూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు విడుదలైన యాష్(Rocking Star Yash) టాక్సిక్ టీజర్ చూసిన తర్వాత నాకు ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది అంటే ఆశ్చర్యం వేసింది. ఆమె మహిళలకు ఒక అల్టిమేట్ రోల్ మోడల్ గా నేను భావిస్తున్నాను. ఏ మగ డైరెక్టర్ కూడా ఈమెకు సరితూగరు. ఈ టీజర్ లో వచ్చే ఒక షాట్ ని నిజంగా ఆమె తెరకెక్కించింది అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ ఆలోచనలు ఉన్న రామ్ గోపాల్ వర్మ నే షాక్ కి గురి అయ్యేలా చేసిందంటే , గీతూ మోహన్ దాస్ మాములు అమ్మాయి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
After seeing the @TheNameIsYash starring trailer of #Toxic I have no doubt that @GeethuMohandas_ is the ultimate symbol of Women Empowerment ..No Male director is Man enough in comparison to this Woman .. I still can’t believe she shot this https://t.co/ZxyxU8Da40 pic.twitter.com/qzFUcv9JIb
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2026