Realme – OPPO: స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి ఒప్పో కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రియల్ మీ ఉత్పత్తుల గురించి కూడా ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. చైనా కంపెనీలు అయినప్పటికీ .. ఇది భారతీయ మార్కెట్లో తిరుగులేని స్థాయిని అందుకున్నాయి . ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ ప్రవేశపెడుతూ అదరగొడుతున్నాయి. 2026 లో ఈ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించాయి.
ఒప్పో, రియల్ మీ కి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. చైనా కంపెనీ ఒప్పో గూటికి రియల్ మీ కంపెనీ చేరింది. ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్ గా కార్యకలాపాలు సాగిస్తుందని సమాచారం. ఈవిలినం వల్ల సమకూరే ఆర్థిక వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ.. మార్కెట్లో మరింత డెవలప్ కావాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విలీనం అనంతరం రియల్ మీ నుంచి రావాల్సిన ఫోన్లు షెడ్యూల్ ప్రకారమే మార్కెట్లోకి విడుదలవుతాయని తెలుస్తోంది. ఈ విక్రయం అనంతరం సేవలు మొత్తం ఒప్పోలో విలీనం అవుతాయి.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో షావోమి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒప్పో ఆ కంపెనీకి పోటీ ఇచ్చినప్పటికి.. స్థిరంగా నిలబడలేకపోయింది. అయితే రియల్ మీ షావోమి కంపెనీకి గట్టి పోటీ ఇచ్చింది. భారత్ మాత్రమే కాకుండా ఆగ్నేయ ఆసియా, యూరప్ ప్రాంతాలలో రియల్ మీ కంపెనీకి అద్భుతమైన మార్కెట్ ఉంది. అయితే భవిష్యత్తు కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం ఖర్చులను తగ్గించుకుని.. రియల్ మీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వన్ ప్లస్ కూడా ఒప్పో కు సంబంధించి సబ్ బ్రాండ్ గా కొనసాగుతోంది. మరోవైపు వివో, ఒప్పో కంపెనీలకు బి బి కే ఎలక్ట్రానిక్ సంస్థ మాతృ కంపెనీగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి పేరుకే ఇవి పోటీ కంపెనీలుగా చలామణి అవుతున్నప్పటికీ.. ఒకే గ్రూపులో పనిచేస్తున్నాయి. పేర్లు మాత్రమే వేరు.. మార్కెటింగ్ వ్యూహాలను మాత్రం ఒకే విధమైన తీరులో వెళ్తున్నాయి.
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివో, ఒప్పో, వన్ ప్లస్ బ్రాండ్ లు తిరుగులేని స్థాయిని అందుకున్నాయి. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. బడ్జెట్ నుంచి మొదలు పెడితే ప్రీమియం వరకు ప్రతి సెగ్మెంట్లో కూడా ఈ ఫోన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే ఆపిల్ మార్కెట్ కు గండి కొట్టడానికి ఇవి ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితం రావడం లేదు.. ఇప్పుడు సబ్ బ్రాండ్లుగా ఉత్పత్తులు తయారు చేయడం మొదలు పెట్టిన నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో ఆపిల్ ఉత్పత్తులకు దీటైన పోటీ ఇవ్వాలని బిబికే లక్ట్రానిక్స్ భావిస్తోంది.