https://oktelugu.com/

ఆర్జీవీ.. యాంకర్.. ఓ బికినీ.. నెట్‌లో హల్‌చల్‌!

వివాదస్పద సినిమాలు తీసే రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే సినిమాలు, బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో సెన్సేషన్‌ సృష్టిస్తాయి. అయితే సినిమాలతో, ట్వీట్లతో లేదంటే యూట్యూబ్‌ చానల్స్‌లో ఇంటర్వ్యూలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు ఆర్జీవీ. టీవీలకే కాకుండా పిలిచిన ప్రతీ యూట్యూబ్‌ చానల్‌కు వెళ్లి ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడుతాడు. అదే టైమ్‌లో యాంకర్ అమ్మాయి అయితే ఆమె అందంగా ఉంటే తెగ పొగిడేస్తుంటాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో ఓ అందమైన యాంకర్ పై […]

Written By:
  • admin
  • , Updated On : June 26, 2020 / 04:46 PM IST
    Follow us on


    వివాదస్పద సినిమాలు తీసే రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే సినిమాలు, బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో సెన్సేషన్‌ సృష్టిస్తాయి. అయితే సినిమాలతో, ట్వీట్లతో లేదంటే యూట్యూబ్‌ చానల్స్‌లో ఇంటర్వ్యూలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు ఆర్జీవీ. టీవీలకే కాకుండా పిలిచిన ప్రతీ యూట్యూబ్‌ చానల్‌కు వెళ్లి ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడుతాడు. అదే టైమ్‌లో యాంకర్ అమ్మాయి అయితే ఆమె అందంగా ఉంటే తెగ పొగిడేస్తుంటాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో ఓ అందమైన యాంకర్ పై ఇలాంటి కామెంట్లే చేశాడు .

    సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

    ‘మీకు ఇటీవల ఏ అమ్మాయిని చూస్తే వావ్‌ అనిపించే డిజైర్ కలిగింది’ అని ఆమె ఆడగ్గా నీతో పాటు చాలా మంది అని అన్నాడు. దాంతో ఆమె సిగ్గు పడుతూ నవ్వింది. అంతేకాదు ‘మీకేమైనా మూడు క్రేజీ డిజైర్స్‌ (కోరికలు) ఉన్నాయా’ అని ఆమె మరో ప్రశ్న వేసింది. తనకు చాలా ఉన్నాయని చెప్పిన ఆర్జీవీ.. ‘నాకు మిమల్ని బికినీలో చూడాలనుంది. మీకు నా మూవీలో ఓ ఆఫర్ ఇస్తా’ అని చెప్పడంతో ఆ యాంకర్ ముఖంలో ఆనందంతో కూడిన షాక్‌ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్స్‌ తమ ఎడిటింగ్‌ స్కిల్స్‌తో రకరకాల వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. ఖుషీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ని జతచేసి ఎడిట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆర్జీవీ కంట కూడా పడింది. దీన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన రాము ‘సోషల్‌ మీడియాలో క్రియేటివిటీకి హద్దులే ఉండవు. నాకు ఇంటర్వ్యూవర్ అరియానాకు మధ్య ఏం జరిగిందో చూడండి’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.