Bigg Boss 6 Telugu Revanth: ప్రతి ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ సరికొత్త సీసన్ ఇటీవలే ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ ఆరవ సీసన్ కి మొదటి రోజు నుండే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో బిగ్ బాస్ మరోసారి సఫలీకృతం అయ్యాడు..అయితే ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో మనకి ముఖ పరిచయం ఉన్న కంటెస్టెంట్స్ తక్కువ మంది మాత్రమే ఉన్నారు..వారిలో సింగర్ రేవంత్ కూడా ఉన్నారు..హౌస్ లో ఇప్పుడు పాపులారిటీ పరంగా మరియు చురుగ్గా టాస్కులు ఆడడం వంటి వాటిల్లో రేవంత్ ప్రధానంగా అందరికంటే ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తున్నాడు..రేవంత్ ని బిగ్ బాస్ హైలైట్ చేస్తున్న తీరుని గమనిస్తుంటే మరో కౌశల్ గా రేవంత్ ని మార్చబోతున్నారా అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో మొదలైంది..ఇప్పటి వరుకు ప్రసారమైన బిగ్ బాస్ సీసన్స్ లో కౌశల్ అనే వాడు ఒక ప్రభంజనం అనే చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీసన్ 2 లో పాల్గొన్న కౌశల్ కి అప్పట్లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..ఒక సినిమా హీరో కి ఎంత క్రేజ్ వస్తుందో ఆ రేంజ్ క్రేజ్ కౌశల్ కి వచ్చింది..అతను అంతలా పాపులర్ అవ్వడానికి కారణం అతను టాస్కులు అద్భుతంగా ఆడడం తో పాటు, అతనిని ఇంటి సభ్యులందరు టార్గెట్ చెయ్యడం కూడా ఒక రీసన్ అని చెప్పొచ్చు..సరిగ్గా రేవంత్ విషయం లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది..ముక్కుసూటితనం, మనసు లో ఏది ఉంటె అది మాట్లాడడం రేవంత్ స్టైల్..అందుకే ఆయన హౌస్ లో అందరికంటే ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తున్నాడు..అయితే బిగ్ బాస్ హౌస్ కూడా ఎక్కువగా కావాలనే రేవంత్ ని హైలైట్ చేస్తున్నాడా??,ఆయనని టార్గెట్ చేస్తే ఎక్కువ కంటెంట్ వస్తుందని హౌస్ మేట్స్ తో కావాలని ఇలా చెయ్యిస్తున్నాడా అనే సందేహాలు కూడా నెటిజెన్స్ లో మొదలయ్యాయి.

మరి రాబొయ్యే రోజుల్లో రేవంత్ కూడా మరో కౌశల్ అవబోతున్నాడా లేదా అనేది చూడాలి..ఇప్పటికే దిగ్విజయంగా మొదటి వారం ని పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీసన్ 6 లో మొదటి వారం నామినేట్ అయినా ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేసే ప్రక్రియ ని బిగ్ బాస్ టీం ఉపసంహరించుకున్న మన అందరికి తెలిసిందే..బిగ్ బాస్ తెలుగు హిస్టరీ మొట్టమొదటిసారి ఇలా జరిగింది..నమోదైన ఓట్ల ప్రకారం గత వారం హౌస్ నుండి ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అవ్వాల్సింది..కానీ మొదటి వారం ఇంటి సభ్యులు ఒకరికొకరు కనెక్షన్ పూర్తిగా ఏర్పడలేదు కనుక మొదటి వారం ఎలిమినేషన్ అనే ప్రక్రియ ని తొలగించారు..ఇది నిజంగా ఎవ్వరు ఊహించని ట్విస్ట్..భవిష్యత్తులో బిగ్ బాస్ ఇంకా ఎన్ని ట్విస్టులు ఇస్తాడో చూడాలి.
Also Read:Krishnam Raju Marriages : కృష్ణంరాజుది రెండో పెళ్లా? మొదటి భార్య ఎవరు? ఏంటా స్టోరీ?
[…] Also Read: Bigg Boss 6 Telugu Revanth: మరో కౌశల్ కాబోతున్న రేవంత్… […]