Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభ ఎపిసోడ్ నుండి నేటి వరుకు హౌస్ లో అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటూ, టాస్కులు మరియు ఎంటర్టైన్మెంట్ పంచడం అందరికంటే మేటి అనిపించుకున్న కంటెస్టెంట్ రేవంత్..అందుకే ఇతనికి అంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఏర్పడింది..నామినేషన్స్ లోకి ఎప్పుడొచ్చినా కూడా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతాడు రేవంత్..ప్రస్తుతానికి అయితే టైటిల్ ని కూడా అతనే గెలుచుకోబోతున్నాడు..కానీ రేవంత్ ప్రేక్షకుల మనసులను అయితే గెలుచుకోగలిగాడు కానీ..ఇంటి సభ్యులందరితో సఖ్యత మాత్రం మైంటైన్ చెయ్యడంలో విఫలం అవుతున్నాడు.

ఒక్క శ్రీహాన్ మరియు శ్రీ సత్య మినహా హౌస్ లో అందరూ రేవంత్ పై గుర్రుగానే ఉంటారు..ఇక ఈ వారం కెప్టెన్ అయ్యి హౌస్ మేట్స్ నుండి మరింత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు రేవంత్..త్రింది విషయం లో ఇంటి సభ్యులకు అతను పెట్టే ఆంక్షలు ఎవరికీ నచ్చడం లేదు..కెప్టెన్ అంటే ఇంటిని బాధ్యతతో మోసేవాడు కానీ అధికారం చలాయించేవాడు కాదు అని హౌస్ మేట్స్ అందరూ తిట్టుకుంటున్నారు.
త్రింది విషయం లో ఇంటి సభ్యులందరికి అంతటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన రేవంత్..తాను మాత్రం ఫాలో అవ్వడం లేదని ఇనాయ చెప్తుంది..ఎవరికీ తెలియకుండా పాలుని అదనంగా దాచిపెట్టుకొని త్రాగడం నేను చూశానని చెప్పుకొచ్చింది ఇనాయ..త్రింది విషయం లో రేవంత్ మొదటి నుండి ఇలాగే ప్రవర్తిస్తున్నాడని..తనకి ఒక్కటి ఒక రూల్..మిగిలిన ఇంటి సభ్యులందరికి మరో రూల్ అన్నట్టు రేవంత్ ప్రవర్తన ఉంటుందని హౌస్ మేట్స్ నుండి ఎప్పుడూ వినిపించే ఆరోపణ.

మరో విషయం గమనిస్తే హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ మొదటి వారం తో పోలిస్తే ఇప్పుడు బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తారు..ఒక్క రేవంత్ తప్ప..అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి లావు ఎక్కిన ఏకైక కంటెస్టెంట్ గా రేవంత్ ఒక చెత్త రికార్డుని నెలకొల్పదని..బహుశా ఈ రికార్డుని భవిష్యత్తులో కూడా ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరేమోనని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు..మరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత తన మీద వచ్చిన ఈ ట్రోల్ల్స్ ని చూసి రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.