Retro : కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం లో తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ మొదటి నుండి ఈ చిత్రానికి భారీ హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి. వర్కింగ్ డేస్ లో కూడా పూర్తిగా డ్రాప్ అవ్వకుండా, ఎదో ఒక మోస్తారు వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుంది. ‘కంగువా’ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయితే అవ్వదు కానీ, కచ్చితంగా కమర్షియల్ ఫ్లాప్ అవ్వుధి అనేది మాత్రం పక్కా. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అలాంటిది మరీ. అయితే ఈ చిత్రాన్ని రజినీకాంత్ కోసం ముందుగా రాసుకున్నాను అంటూ కార్తీక్ సుబ్బరాజ్ ప్రొమోషన్స్ సమయం లో చెప్పుకొచ్చాడు.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!
కేవలం ఆయనతో ఈ సినిమా కుదరకపోవడం, స్క్రిప్ట్ ని మళ్ళీ రాసుకొని, అందులో లవ్ స్టోరీ ఎలిమెంట్స్ ని బాగా పెట్టి అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) తో ఈ చిత్రాన్ని చేయాలని అనుకున్నాడు. ఆయన్ని కలిసి స్టోరీ ని కూడా వినిపించాడు. కానీ ఎందుకో ఒప్పుకోలేదు. చివరికి సూర్య వద్దకు ఈ కథ చేరింది. సింగిల్ సిట్టింగ్ లోనే ఆయన ఈ స్టోరీ ని ఓకే చేశాడు. రెండు మూడు గెటప్స్ లో కనిపించొచ్చు అనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని ఓకే చేసాడో ఏమో తెలియదు కానీ, ఇంతమంది హీరోలకు నచ్చని ఈ కథ, సూర్య కి ఎలా నచ్చిందో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు సూర్య సినిమాలు ఏ రేంజ్ లో ఉండేవి, స్క్రిప్ట్ సెలక్షన్ అంటే సూర్య రేంజ్ లో ఉండాలి అని ఆరోజుల్లో పోల్చేవారు.
అలాంటి సూర్య ఇప్పుడు స్క్రిప్ట్ ఎంపిక విషయం లో పూర్తిగా గాడితప్పడం అభిమానులకు మింగుడు పడడం లేదు. పొరపాటున ఈ సినిమా నాగ చైతన్య చేసుంటే కచ్చితంగా ఆయన కెరీర్ పూర్తి స్థాయిలో రిస్క్ లో పడేది. కస్టడీ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయం లో ఈ కథ ని విన్నాడట. అంటే ఆయన ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే, ‘తండేల్’ కంటే ముందు ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అయ్యుండేది. అదే జరిగి ఉండుంటే నాగ చైతన్య కి హ్యాట్రిక్ డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలి ఉండేది, భలే తప్పించుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కలిసి రావడం తో ఆయన ఈ సినిమా నుండి తప్పుకొని, తండేల్ చిత్రం చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇకపోతే సూర్య తన తదుపరి చిత్రాన్ని వెంకీ అట్లూరి తో చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా నాగవంశీ ఈ చిత్రాన్ని నిమరించబోతున్నాడు. తెలుగు లో సూర్య కి ఇదే మొదటి డైరెక్ట్ సినిమా.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!