Retro Collection: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై, మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న సూర్య, ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇది కూడా మిస్ ఫైర్ అయ్యింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బుక్ మై షో లో ఈ చిత్రానికి కేవలం ‘7.6’ ఆడియన్స్ రేటింగ్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది అనేది. కానీ ఈ చిత్రానికి ఫుల్ రన్ లో ‘కంగువా’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా సూర్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: యుద్ధ సమయంలో విదేశాలకు ఎన్టీఆర్..వైరల్ అవుతున్న వీడియో!
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. తమిళనాడు ప్రాంతం లో 8 రోజులకు గాను 43 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది సూర్య గత చిత్రం ‘కంగువా’ ఫుల్ రన్ కంటే ఎక్కువ వసూళ్లు అనొచ్చు. అదే విధంగా ఓవర్సీస్ లో 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 20 లక్షలు, కర్ణాటక ప్రాంతం నుండి 10 కోట్ల 55 లక్షలు, కేరళ నుండి 4 కోట్ల 30 లక్షలు, హిందీ వెర్షన్ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 35 లక్షలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 8 రోజుల్లో 89 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ ఈ చిత్రానికి కచ్చితంగా బాగా కలిసి రావొచ్చు. ఈ వీకెండ్ తోనే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవచ్చు.
ఫ్లాప్ టాక్ తో ఇంత డీసెంట్ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గ్రేట్, కానీ నష్టాలు మాత్రం భారీగానే ఉండేట్టుగా అనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు విడుదలకు ముందు 82 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ వసూళ్ళలో షేర్ ని లెక్కగడితే కేవలం 44 కోట్ల 40 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే సూపర్ హిట్ మార్కుని అందుకోవాలంటే మరో 37 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అంటే మరో 80 రూపాయిల గ్రాస్ అనుకోవచ్చు. అది దాదాపుగా అసాధ్యం, మహా అయితే ఇంకో 20 నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు, అది కూడా ఈ వీకెండ్ బాగా ఆడితేనే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.