Retro : సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సూర్య(Suriya Sivakumar) కి సూపర్ హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. సుమారుగా 12 ఏళ్ళ నుండి ఆయన సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సూర్య లాంటి అద్భుతమైన నటుడు మన ఇండస్ట్రీ లో ఉండుంటే, ఆయనపై ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ చేసేవారు మన టాలీవుడ్ దర్శకులు. కానీ తమిళ డైరెక్టర్స్ ఎందుకు ఆయన పొటెన్షియల్ ని వాడుకోవడం లేదో అర్థం కావడం లేదని విశ్లేషకులు సైతం బాధ ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ‘కంగువా’ చిత్రం తో ఆయన ఏ రేంజ్ ఫ్లాప్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ తో చేసిన ‘రెట్రో'(Retro Movie) చిత్రమైన విజయం సాధిస్తుంది అనుకుంటే, ఈ చిత్రం ‘కంగువా’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టేలా ఉంది.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!
ముఖ్యంగా వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ కి ఈ చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ గా నిల్చింది అనొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ రైట్స్ ని ఆయనే కొనుగోలు చేసాడు. దాదాపుగా పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే మొదటి రోజు కోటి 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, రెండవ రోజు కేవలం 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలా రెండు రోజుల్లో కోటి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మరో 8 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ కోసం రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 82 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ఈరోజు, రేపు వచ్చే వసూళ్లే కీలకం, ఆ తర్వాత లాంగ్ రన్ పెద్దగా ఉండకపోవచ్చు.ఈ రెండు రోజులకు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, అంటే పది కోట్ల షేర్ రీకవర్ అవ్వొచ్చు. ఆ తర్వాత ఫుల్ రన్ లో మరో 5 కోట్లు రీకవర్ అవ్వొచ్చు. అంతకు మించి రీ కవర్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. సాలిడ్ గా రన్ పూర్తి అయ్యేసరికి 20 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు లో ఈ చిత్రానికి రెండు రోజుల్లో 22 కోట్ల రూపాయిలు రాగా, ఓవర్సీస్ ప్రాంతంలో 13 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు, రేపు ఓవర్సీస్ నుండి మెరుగైన వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!