RGV-Perni Nani Meeting: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఈ రోజు అమరావతికి వెళ్లి మరీ కలిసిశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరి మంత్రితో భేటీ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో ముచ్చటిస్తూ.. ‘మంత్రి పేర్ని నాని గారితో నా సమావేశం ముగిసింది. నాకు ఈ సమావేశం పూర్తి సంతృప్తినిచ్చింది. నానితో మాట్లాడాక నేను నిజంగానే 100 శాతం సంతృప్తి చెందడం జరిగింది. ఈ సినిమా టికెట్ల విషయంలో నా ఆలోచనలను మంత్రికి పూర్తిగా నా కోణంలో ఒక సినిమా దర్శకుడిగా చెప్పాను.

అయితే, నా వాదన విన్న తర్వాత నాని గారు కూడా ప్రభుత్వ ఆలోచనలను నాకు వివరించడం జరిగింది. అయితే, మా చర్చలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, నేను కేవలం నా ఆలోచనలను మాత్రమే వినిపించడానికి ఇక్కడకు వచ్చాను. మరి నా కోణంలో వినిపించిన ఆలోచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
Also Read: పేర్నినానితో వర్మ భేటి: పవన్, బాలయ్యలపై హాట్ కామెంట్స్
ఇక ఆర్జీవీతో భేటీ తర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టదు. అయితే, ఈ సినిమా టికెట్ల విషయానికి వస్తే.. అది సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే టికెట్ల రేట్లు నిర్ణయించాము. అయితే, సినీ దర్శకుడు వర్మ లాగా మాకు ఎవరు సూచనలు చేసినా వాటిని మేము తీసుకుంటాము.
కాకపోతే టికెట్ల అంశంపై నియమించిన కమిటీ నివేదిక తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక చివరగా ఏపీలో కేసులు పెరుగుతున్నప్పుడు థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉండదు అని తేల్చి చెప్పారు.
Also Read: రాంగోపాల్ వర్మకు నాన్ వెజ్ పెట్టిన మంత్రి పేర్ని నాని.. 2 గంటలుగా చర్చలు