https://oktelugu.com/

Movie Tickets: పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్​ షోకు లేని ఇబ్బంది.. ఏపీలో ఎందుకొచ్చింది?

Movie Tickets: ఏపీలో సినమా టికట్ల ధరల వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతోంది. టాలీవుడ్​లో ప్రస్తుతం ఈ విషయమే హాట్​టాపిక్​గా మారింది. పెద్దహీరోల సినిమాలకు బెనిఫిట్​ షోలు వేయడం ఎప్పటినుంచే వస్తోంది. అయితే, ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్​షోను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు హీరోల అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కొత్త ఆంక్షలు.. దీని వల్ల మీకొచ్చే నష్టమేంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 12:10 PM IST
    Follow us on

    Movie Tickets: ఏపీలో సినమా టికట్ల ధరల వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతోంది. టాలీవుడ్​లో ప్రస్తుతం ఈ విషయమే హాట్​టాపిక్​గా మారింది. పెద్దహీరోల సినిమాలకు బెనిఫిట్​ షోలు వేయడం ఎప్పటినుంచే వస్తోంది. అయితే, ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్​షోను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు హీరోల అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కొత్త ఆంక్షలు.. దీని వల్ల మీకొచ్చే నష్టమేంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

    Pushpa Movie Review

    అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతమందికి సంతోషాన్నికలిగిస్తోంది. పెద్ద సినిమాలొస్తే.. థియేటర్లు సామాన్యులను దొచుకుంటాయని.. ప్రభుత్వం భావించి టికెట్​ ధలరపై ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  కానీ, ఇప్పుడు సమస్యంతా బెనిఫిట్​ షో దగ్గరవచ్చింది. పక్కరాష్ట్రాల్లో ఫ్యాన్​షోలు వేస్తున్నప్పుడు.. ఏపీలో ఎందుకు కుదరదంటూ.. అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు.

    Also Read: తెలుగు తెర గౌరవానికి ముఖ్య కారణం అతనే !

    తమకు ఇష్టం ఉండబట్టే కదా.. బెనిఫిట్​షోకు వెళ్తున్నామంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఫ్యాన్​ షోరు ఎందుకు రద్దు చేశారో చెప్పాలంటూ సినిమా ప్రదర్శిస్తున్న బాలాజీ థియేటర్​పై రాళ్లు విసిరారు.

    కాగా, డిసెంబరు 17న విడుదలైన పుష్ప.. భారీ రెస్పాన్స్​తో దూసుకెళ్లిపోతోంది. రివ్యూల్లోనూ పుష్పకు పాజిటివ్​ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. సునీల్​, అనసూయ కీలక పాత్రలు పోషించారు.

    Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!