Chiranjeevi Name Restaurant: తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే చాలు కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలు గర్వంతో మురిసిపోతాయి… ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన నటుడు చిరంజీవి… ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి ‘ఇంతంతై వటుడింతై’ అన్నట్టుగా రోజురోజుకీ తన రేంజ్ ని పెంచుకుంటూ 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఒకే ఒక నటుడు చిరంజీవి…ఇక రీసెంట్ గా చిరంజీవి పేరుని వాడుకొని కొంతమంది అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. తన టీమ్ తో కలిసి కొంతమందికి లీగల్ నోటీసులు పంపించాడు… ఇక అందులో భాగంగానే నల్లగండ్ల లో స్ట్రీట్ బైట్ రవి అనే వ్యక్తి చిరంజీవి పేరు మీద ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తున్నాడు. అతనికి కూడా నోటీసులు పంపించారు. దాంతో కొంతవరకు ఆందోళన చెందిన రవి చిరంజీవి టీమ్ ని కలిసి రెస్టారెంట్ కి చిరంజీవి పేరు పెట్టాం. కానీ ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయడం లేదని చెప్పాడు. తన అభిమానిగా చిరంజీవి పేరు మీద ఈ రెస్టారెంట్ ను రన్ చేసుకుంటున్నానని చెప్పాడు. దాంతో చిరంజీవి టీమ్ సైతం అక్కడికి వెళ్లి తన రెస్టారెంట్ ని గమనించారట… రెస్టారెంట్ లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం లేదని తెలుసుకున్నారు. అలాగే రెస్టారెంట్ మొత్తం చిరంజీవి ఫోటోలతోనే నింపేయడం చూసిన రవి ని చిరంజీవి టీమ్ అభినందించిందట. కేవలం చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనే ఆయన రెస్టారెంట్ ని నడిపించుకుంటున్నాడని గమనించిన చిరంజీవి టీమ్ సైతం ఈ విషయాన్ని మెగాస్టార్ కి తెలియజేయడంతో యధావిధిగా రవి తన రెస్టారెంట్ ని రన్ చేసుకోవచ్చు అని చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట…
ఇక ఈ విషయం మీద రవి మాట్లాడుతూ చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా అభిమానం ఉంది. కాబట్టి అతని పేరు మీద ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశాను. నిజానికి చిరంజీవి పేరు చెడిపోకూడదనే ఉద్దేశ్యంతోనే క్వాలిటీ ఫుడ్ ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చిరంజీవి పేరుకి బ్యాడ్ నేమ్ వస్తే నాకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కదా అతని పేరు చెడగొట్టకుండా ఈ రెస్టారెంట్ ని రన్ చేసుకుంటాను అని చెప్పాడు…
చిరంజీవి పేరుని వాడుకొని ఇల్లీగల్ పనులను చేసే వాళ్లకు మాత్రమే నోటీసులు పంపించారని అనుకోకుండా తనకు కూడా నోటీసు వచ్చిందని ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకున్నారని యధావిధిగా నా రెస్టారెంట్ ని నడిపించుకుంటున్నానని తను చెప్పిన మాటలు ఇప్పుడు చిరంజీవితో పాటు చాలామంది అభిమానులను కూడా ఉత్తేజపరుస్తున్నాయి.
నిజానికి చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది చాలా రకాల వృత్తులను చేసుకుంటున్నారు. చిరంజీవి ఎలాగైతే కష్టపడి పైకి వచ్చాడో ఆయనలాగే అందరూ తమ వృత్తిలో కష్టపడి పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందే తప్ప ఎవరు నెగెటివ్ గా మాత్రం తీసుకోరు అంటూ మరి కొంతమంది చిరంజీవి అభిమానులు తెలియజేస్తుండటం విశేషం…