Renu Desai : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్(Renu Desai) తన పిల్లలతో కలిసి పూణే లో ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే. పిల్లలు అకిరా నందన్(Akira Nandan), ఆద్య పూణే నుండి హైదరాబాద్ కి తల్లితండ్రులతో కలిసి గడిపేందుకు తిరుగుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన కొత్తల్లోనే రేణు దేశాయ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. అప్పట్లో ఈ ప్రకటన పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియా లో అనేక విమర్శలు కూడా ఎదురయ్యాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా రేణు దేశాయ్ ఒక వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఈమెకు నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేసాడు.
Also Read : లైవ్ లో లవ్ ప్రపోజల్ చేసిన యాంకర్ ప్రదీప్..వైరల్ అవుతున్న వీడియో!
నిశ్చితార్థం అయితే జరిగింది కానీ, పెళ్లి మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. చాలా మంది సోషల్ మీడియా లో రేణు దేశాయ్ రెండవ పెళ్లి సంగతి ఏమైంది?, అప్పట్లో నిశ్చితార్థం కూడా చేసుకుంది కదా?, బ్రేకప్ చేసుకుందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రేణు దేశాయ్ ని ప్రశ్నించారు. ఆమె ఇన్ని రోజులు వాటిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే ఆమె చాలా కాలం తర్వాత రీసెంట్ గానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి పోడ్ క్యాస్ట్ చేసింది. ఇందులో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రెండవ పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘రెండు అప్పట్లో రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నిశ్చితార్థం కూడా చేసుకున్నాను. కానీ పిల్లల గురించి అలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలను పోషించడం తో పాటు, వైవాహిక బంధాన్ని సమాంతరంగా బ్యాలన్స్ చేయలేనేమో అని నాకు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆధ్య కి ఇప్పుడు 15 ఏళ్ళు..ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్, నిన్న అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోని ఒకటి విడుదల చేసింది. అదే విధంగా మరో రెండేళ్లలో అకిరా నందన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, రామ్ చరణ్ ఆ చిత్రానికి నిర్మాత వంటి వార్తలపై కూడా రేణు దేశాయ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సోషల్ మీడియా లో ప్రచారమైన వార్తలన్నీ అబద్దాలే. అకిరా సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నేనే అందరికీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.
Also Read : మహేష్ తో రాజమౌళి.. ఆ సెంటిమెంట్ ఫాలో